Snake Fruit: అరుదుగా కనిపించే ఈ పండుతో అద్భుతమైన లాభాలు

Update: 2024-10-29 16:15 GMT

Health Benefits of snake fruits in Telugu: మనకు తెలియని ఎన్నో వింతలు, విశేషాలకు నెలవు ఈ ప్రపంచం. తినే ఆహారంలోనూ ఎన్నో వైవిధ్యాలు ఉన్నాయి. మనకు తెలియని పండ్ల రకాలు ఎన్నో. అలాంటి వాటిలో స్నేక్‌ ఫ్రూట్‌ ఒకటి. ఇండోనేషియాలోని బాలి, లాంబాక్, తైమూర్ దీవులలో ప్రత్యేకంగా ఈ పండ్లను సాగు చేస్తున్నారు. అయితే ఈ పండ్లు విరివిగా లభించకపోయినా.. కొన్ని సూపర్‌ మార్కెట్స్‌లో మాత్రం లభిస్తున్నాయి.

అచ్చంగా లిచీ పండు ఆకారాన్ని పోలి ఉండే ఈ పండుతో ఎన్నో లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. పండు పైభాగం అచ్చంగా పామును పోలి ఉంటుంది. అందుకే దీనిని స్నేక్‌ ఫ్రూట్‌గా చెబుతుంటారు. ఈ పండును తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

స్నేక్‌ ఫ్రూట్‌లో కార్బోహైడ్రేట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. తరచూ వచ్చే రోగాలను నయం చేయడంలో ఉపయోగపడుతుందని న్యూట్రిషన్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. డీహైడ్రేషన్‌ సమస్యతో బాధపడేవారికి కూడా ఈ పండు బాగా ఉపయోగపడుతుందంటున్నారు. శరీరంలో నీటి కొరతను దూరం చేస్తుందని.. అలాగే డయాబెటిస్‌ బాధితులకు కూడా స్నేక్‌ ఫ్రూట్ మేలు చేస్తుందని చెబుతున్నారు. ఇందులోని ఫైబర్‌ కంటెంట్‌ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా గర్భిణీలకు ఈ పండు ఎంతో మేలు చేస్తుందని వారు సలహా ఇస్తున్నారు.

చిన్నారుల్లో జ్ఞాపకశక్తిని పెంచడంలో స్నేక్‌ ఫ్రూట్‌ కీలకపాత్ర పోషిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఈ పండు బెస్ట్‌ ఆప్షన్‌గా చెబుతున్నారు. ఇందులోని ఫైబర్‌ కంటెంట్ కారణంగా త్వరగా కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఇక ఈ ఫ్రూట్‌లో పొటాషియం కంటెంట్‌ అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును అదుపు చేయడంలో ఉపయోగపడుతుంది. దీంతో గుండె సంబంధిత సమస్యలను దూరం చేయడంలో ఉపయోగపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

Tags:    

Similar News