ఉప్పుతో ముప్పే.. అధికమైతే అనర్థమే

మీ పేస్ట్ లో ఉప్పుందా... అంటూ వచ్చే యాడ్ లాగా మీ వంటల్లో అధికంగా ఉప్పు ఉందా...అనే సందర్భం రానే వచ్చేసింది.

Update: 2020-01-19 05:25 GMT

మీ పేస్ట్ లో ఉప్పుందా... అంటూ వచ్చే యాడ్ లాగా మీ వంటల్లో అధికంగా ఉప్పు ఉందా...అనే సందర్భం రానే వచ్చేసింది.. ఎందుకంటే... ఉప్పు లేని పప్పుకూడు ఎందుకురా కాదు... అధికంగా ఉప్పుంటే ముప్పేరా అనే రోజులు ఇవి..మనం చేసే ప్రతి వంట ఎంత బాగా వచ్చినా అందులో ఉప్పు లేకుంటే రుచి ఉండదు...నాలుకని ఆకర్షించి తన రుచితో మనిషిని బానిసగా మార్చేసుకుంటుంది ఉప్పు. ఆవకాయ అయినా..పప్పు అయినా... బిర్యానీ అయినా సరే ఉప్పు లేనిదే ముద్ద దిగదు.

అయితే ఇది మితంగా ఉంటే ఫరవాలేదు...కానీ అధికంగా సేవిస్తే అంతే సంగతులు అంటున్నారు వైద్యులు. ఈ మధ్యకాలంలో ముఖ్యంగా తెలుగురాష్ట్రాల్లో సాధారణంగా తీసుకునే ఉప్పుకంటే రెండింతలు అధికంగా ఉప్పును తీసుకుంటున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. WHO ప్రతి రోజు ఒక వ్యక్తి సుమారుగా 5 గ్రాముల ఉప్పు తింటే సరిపోతుందని సూచిస్తోంది.. కానీ తెలంగాణలో ఏకంగా 14.67 గ్రాముల ఉప్పుడు తినేస్తున్నారట.

అధికంగా ఉప్పును తీసుకోవడం వల్ల రక్తస్రావం , దప్పిక పెరుగుతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు, బలం నశించి జుట్టు కూడా త్వరగా నెరుస్తుందని అంటున్నారు. వెంట్రుకలు త్వరగా ఊడి బట్టతల రావడం, చర్మంలో కాంతి తగ్గి ముడతలు వస్తాయని చెబుతున్నారు. వీటితో పాటే ఇతర చర్మ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇవంటే చిన్న చిన్న సమస్యలు అని వదిలేస్తారు..కానీ గుండెకు సంబంధిన సమస్యలు కూడా అధికంగా ఉప్పును ఊదేయడం వల్ల వస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. బీపీ పెరుగుతుంది..అలాగే కడ్నీ సమస్యలు కూడా మొదలవుతాయంటున్నారు.

ముఖ్యంగా మనవాళ్లకి ఎంత ఉప్పు తీసుకుంటున్నామో లెక్క తీలుదు..ఏది టేస్టీగా ఉంటే చాలు దాన్ని ముందూ వెనక ఆలోచించకుండా లాగించేస్తారు...ముఖ్యంగా ఊరగాయల్లో, నిల్వ పచ్చళ్లలో, అప్పడాల్లో..ఈ మధ్య వచ్చిన ఫ్రెంచ్ ఫ్రైల్లలో, డీప్ ఫ్రైలల్లో అధికంగా ఉప్పు ఉంటుంది..వీటిని తీసుకోవవం మెళ్లిగా మానెయ్యాలి. వంటకాల్లోనూ తక్కువగా ఉప్పును వినియోగించాలి.ఎంత తక్కువగా ఉప్పు తీసుకుంటే ఆరోగ్యానికి అంత మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.  

Tags:    

Similar News