Health Tips: ఉదయం నిద్రలేచిన వెంటనే కళ్లు కడుగుతున్నారా.. ఈ విషయాలు గమనించండి..!

Health Tips: మన శరీరంలో కళ్లు చాలా సున్నిత అవయవాలు. ఇవి లేకపోతే ప్రపంచాన్ని చూడలేం.

Update: 2024-04-25 13:30 GMT

Health Tips: ఉదయం నిద్రలేచిన వెంటనే కళ్లు కడుగుతున్నారా.. ఈ విషయాలు గమనించండి..!

Health Tips: మన శరీరంలో కళ్లు చాలా సున్నిత అవయవాలు. ఇవి లేకపోతే ప్రపంచాన్ని చూడలేం. అందుకే వీటిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. చాలామంది ఉదయం నిద్రలేచిన వెంటనే కళ్లని కడుక్కుంటారు. అయితే ఇది మంచిదే కానీ దీనివల్ల కూడా కొన్ని దుష్ప్రభావాలు ఉంటాయి. మరికొందరు రోజులో చాలాసార్లు కళ్లను కడుగుతూ ఉంటారు. ఇది కూడా మంచి పద్దతి కాదు. దీనివల్ల ఎలాంటి సమస్యలు తలెత్తుతాయో ఈ రోజు తెలుసుకుందాం.

నిజానికి కళ్లలో తగినన్ని నీళ్లు ఉంటాయి. దుమ్ము, ధూళిని శుభ్రం చేయడానికి కంటిలో నీరు సరిపోతుంది. కానీ తరచూ నీటితో కళ్లను శుభ్రం చేసుకోవడం వల్ల నీళ్లలోని దుమ్ము కళ్లలోకి చేరి, కార్నియా, కండ్లకలక వంటి సమస్యలు ఎదురవుతాయి. నీటిలోని బ్యాక్టీరియా వల్ల కంటిలోని సున్నితమైన పొరలు దెబ్బతింటాయి. నీటిలో ఉండే బ్యాక్టీరియా, మలినాలు కళ్లలోకి ప్రవేశించి కంటి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. దీనివల్ల ఇన్ఫెక్షన్, చికాకు కలిగే అవకాశం ఉంది.

అదే విధంగా కంటిలో నీరు ఎక్కువగా ఉంటే అది మీ దృష్టిపై ఎఫెక్ట్ చూపిస్తుంది. అందువల్ల కళ్లని నీటితో కడగకుండా శుభ్రమైన గుడ్డను నీటిలో ముంచి కళ్లను శుభ్రం చేసుకోవాలి. దీంతో రాత్రిపూట కళ్ల చుట్టూ ఉన్న మురికి పోవడమే కాకుండా కళ్లు శుభ్రపడతాయి. అలాగే కళ్లకు ఎలాంటి హాని జరగదు. కళ్లు మసకగా ఉన్నా, దృష్టి తక్కువగా ఉన్నా వెంటనే కంటి డాక్టర్‌ని సంప్రదించి టెస్ట్‌ చేయించుకోవాలి. కళ్లద్దాలు వాడాల్సి వస్తే సరిపోయే కళ్లజోడు తీసుకొని వాడాలి. ఇది అన్ని విధాలా శ్రేయస్కరం.

Tags:    

Similar News