WHO: పెరుగుతున్న కరోనా కేసులపై డబ్ల్యూహెచ్‌వో ఆందోళన

WHO: ప్రపంచ వ్యాప్తంగా వారం రోజుల్లో 34 లక్షల కరోనా కేసులు

Update: 2021-07-23 04:29 GMT
వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ (ఫైల్ ఇమేజ్)

WHO: ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసుల విషయంలో డబ్ల్యూహెచ్‌వో ఆందోళన వ్యక్తం చేసింది. గడిచిన వారం రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 34 లక్షల కరోనా కేసులు నమోదైనట్లు డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. ఇంతకు ముందు వారంతో పోల్చుకుంటే ఈ కేసులు 12శాతం పెరిగినట్లు తెలిపింది. అలాగే వారం రోజుల్లో సుమారు 57వేల మంది కరోనా మహమ్మారి వల్ల ప్రాణాలు కోల్పోయారని వెల్లడించింది. ఈ కరోనా కేసుల్లో అత్యథికం ఇండోనేషియా, బ్రిటన్, బ్రెజిల్, భారత్, అమెరికా దేశాల్లో కనిపించినట్లు తెలిపింది. 

Tags:    

Similar News