White House: శ్వేతసౌధం 24 క్యారెట్లు బంగారంతో అలంకరణ
వైట్ హౌస్‌ను 24 క్యారెట్ల బంగారు తాపడాలతో.. అలంకరించడానికి ట్రంప్ చర్యలు ఓవెల్ ఆఫీస్, క్యాబినెట్ రూమ్‌లో స్వర్ణ అలంకరణలు స్వర్ణ తాపడాల ఖర్చును ట్రంప్ స్వయంగా భరిస్తారు
White House: శ్వేతసౌధం 24 క్యారెట్లు బంగారంతో అలంకరణ
అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ను 24 క్యారెట్ల బంగారు తాపడాలతో అలంకరించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. శ్వేతసౌధంలోని ఓవల్ ఆఫీస్, క్యాబినెట్ రూమ్‌లో భారీగా స్వర్ణ అలంకరణలు చేపడుతున్నట్లు స్పష‌్టం చేశారు. ఇప్పటి వరకు అందమైన భవనంగా పేరుపొందిన శ్వేతసౌధం.. ఇకపై విదేశీ నేతలకు వైట్‌హౌస్ అబ్బురపరుస్తుందన్నారు.
శ్వేతసౌధంలో ఏర్పాటు చేయనున్న స్వర్ణ అలంకరణలకు సంబంధించిన వీడియోను ట్రంప్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. వైట్‌హౌస్‌లో స్వర్ణ తాపడాలు చేయించడానికి ఉపయోగించిన బంగారం ఖర్చును ట్రంప్ స్వయంగా భరించనునట్లు వైట్ హౌస్ ప్రతినిధి ఇటీవల స్పష్టం చేశారు.