US Visa Fee Hike: వీసా ప్రీమియం ప్రాసెసింగ్‌ ఫీజులు పెంచిన అమెరికా

US Visa Fee Hike: హెచ్-1బీ, ఎల్-1 వంటి వీసాల ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజులను అమెరికా ప్రభుత్వం పెంచింది.

Update: 2026-01-10 10:48 GMT

US Visa Fee Hike: వీసా ప్రీమియం ప్రాసెసింగ్‌ ఫీజులు పెంచిన అమెరికా

US Visa Fee Hike: హెచ్-1బీ, ఎల్-1 వంటి వీసాల ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజులను అమెరికా ప్రభుత్వం పెంచింది. ఈ మేరకు యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. జూన్ 2023 నుంచి జూన్ 2025 మధ్యకాలంలో ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకొని ఈ ఫీజులు పెంచినట్లు వెల్లడించింది.

వీసా దరఖాస్తులను వేగంగా ప్రాసెస్ చేయడానికి వసూలు చేసే ఈ ప్రీమియం ఫీజు హెచ్-1బీ, ఎల్-1, ఓ-1, పీ-1, టీఎన్ వీసాల విషయంలో $2,805 నుంచి $2,965కు పెరగనుంది. అలాగే ఎఫ్-1, జే-1 వంటి వీసాల ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజును $1,965 నుంచి $2,075కు పెంచింది.

ఈ పెంపు ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రీమియం ప్రాసెసింగ్ సేవలను మెరుగుపరచడానికి ఉపయోగిస్తామని యూఎస్ సీఐఎస్ తెలిపింది. ఈ నిర్ణయంతో భారతీయ విద్యార్థులు, వృత్తి నిపుణులతో పాటు ఇతర దేశాల వీసా దరఖాస్తుదారులపై ప్రభావం పడనుంది.

Tags:    

Similar News