Times Square: రామనామ జపంతో మార్మోగిన ప్రఖ్యాత న్యూయార్క్‌ టైమ్స్‌ స్వ్కేర్‌

Times Square: ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని లైవ్‌లో వీక్షించిన ఎన్‌ఆర్ఐలు

Update: 2024-01-22 13:45 GMT

Times Square: అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవ వేళ న్యూయార్క్‌లోని ప్రఖ్యాత టైమ్స్‌ స్క్వేర్‌ ప్రాంతం రామ నామ జపంతో మార్మోగింది. ప్రవాస భారతీయులు టైమ్స్‌ స్క్వేర్‌ ప్రాంతానికి పెద్ద ఎత్తున చేరుకుని, మన సంప్రదాయాలు ఉట్టిపడేలా భజనలు, కీర్తనలతో ఈ కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. కూడలిలోని విద్యుత్‌ బిల్‌ బోర్డుపై రాముడి చిత్రాలను ప్రదర్శించారు. సాంప్రదాయ దుస్తులు ధరించి, శ్రీరాముడి చిత్రాలున్న జెండాలు చేతబూని వేడుకలు చేసుకున్నారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని లైవ్‌లో వీక్షించారు. ఫ్రాన్స్‌లోని ప్రవాస భారతీయులు సైతం ప్యారిస్‌లో ఉన్న ప్రముఖ పర్యాటక ప్రదేశం ఈఫిల్‌ టవర్‌ వద్దకు చేరి జైశ్రీరామ్‌ నినాదాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు.

Tags:    

Similar News