Donald Trump : ట్రంప్ ప్రయాణిస్తున్న విమానానికి తప్పిన పెను ప్రమాదం

Donald Trump: దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సుకు వెళ్తుండగా ఎయిర్‌ఫోర్స్ వన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో అధ్యక్షుడు ట్రంప్ పర్యటన రద్దైంది.

Update: 2026-01-21 05:03 GMT

Donald Trump : ట్రంప్ ప్రయాణిస్తున్న విమానానికి తప్పిన పెను ప్రమాదం

Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దావోస్ పర్యటన అర్ధాంతరంగా రద్దయ్యింది. ప్రపంచ ఆర్థిక సదస్సులో  పాల్గొనేందుకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌కు బయల్దేరిన ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఈ కారణంగా విమానం యూ-టర్న్ తీసుకుని తిరిగి వాషింగ్టన్‌కు చేరుకుంది.

మంగళవారం వాషింగ్టన్ నుంచి బయల్దేరిన ఎయిర్‌ఫోర్స్ వన్‌లో ప్రయాణిస్తున్న సమయంలో ఎలక్ట్రికల్ వ్యవస్థలో సాంకేతిక సమస్య ఏర్పడినట్లు సమాచారం. భద్రతా కారణాలతో పైలట్లు వెంటనే విమానాన్ని తిరిగి అమెరికాకు మళ్లించినట్లు వర్గాలు వెల్లడించాయి.

దావోస్‌లో ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక సదస్సు కొనసాగుతోంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ట్రంప్ హాజరు కావాల్సి ఉండగా, అనుకోని సాంకేతిక సమస్యతో ఆయన పర్యటన రద్దైనట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ ఘటనపై వైట్ హౌస్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Tags:    

Similar News