South Africa: వజ్రాల కోసం వేల మంది స్థానికులు తవ్వకాలు

South Africa: కరోనా కల్లోలంతో తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో మునిగిపోయిన సౌతాఫ్రికాను మరో సమస్య వేధిస్తుంది.

Update: 2021-06-21 03:30 GMT

South Africa: వజ్రాల కోసం వేల మంది స్థానికులు తవ్వకాలు

South Africa: కరోనా కల్లోలంతో తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో మునిగిపోయిన సౌతాఫ్రికాను మరో సమస్య వేధిస్తుంది. సౌతాఫ్రికాలోని ఓ చిన్న కుగ్రామంలో వేల మంది కోవిడ్ నిబంధనలు అతిక్రమించి గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు. ఆ గ్రామంలో విలువైన వజ్రాలు దొరుకుంతడడమే అందుకు కారణంగా మారింది. అయితే, ఈ తవ్వకాల్ని కట్టడి చేయడంలో స్థానియ యంత్రాంగం విఫలమైంది. ఇంతమంది ఒకేసారి గుమిగూడడంతో కోవిడ్ విజృంభించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు కోవిడ్ ఎఫెక్ట్‌తో దక్షణాఫ్రికా ఆర్ధిక వ్యవస్థ దారుణంగా పతనమైంది. లక్షల మంది ప్రజలు పేదరికంలో కూరుకుపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో తమ తలరాతను మార్చుకునేందుకు వజ్రాల వేటను ముమ్మరం చేస్తున్నారు. అయితే, వారం రోజుల నుంచి తవ్వకాల్లో దొరుకుతున్నవి వజ్రాలేనా అనేది తేల్చడంలో జియాలజిస్టులు విఫలమవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆశచావని స్థానికులు మాత్రం వజ్రాల కోసం తవ్వకాలు కొనసాగిస్తూనే ఉన్నారు.

Tags:    

Similar News