Russia Oil Tanker: చైనాకు షాక్.. భారత్ వైపు రష్యా చమురు నౌక 'యూటర్న్'!

Russia Oil Tanker: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరి, ఇంధన సరఫరాపై ఆందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో ఒక అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.

Update: 2026-03-18 09:54 GMT

చైనాకు షాక్.. భారత్ వైపు రష్యా చమురు నౌక 'యూటర్న్'!

Russia Oil Tanker: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరి, ఇంధన సరఫరాపై ఆందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో ఒక అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. చైనాకు వెళ్లాల్సిన రష్యా చమురు ట్యాంకర్ 'ఆక్వా టైటాన్' (Aqua Titan) ఒక్కసారిగా భారత్ వైపు మళ్లింది. సౌత్ చైనా సముద్ర జలాల్లో ప్రయాణిస్తున్న ఈ నౌక యూటర్న్ తీసుకుని మన దేశం వైపు వస్తుండటం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.

మంగళూరు పోర్టుకు మార్చి 21న:

షిప్ ట్రాకింగ్ డేటా ప్రకారం.. ఈ ట్యాంకర్ జనవరి చివరలో రష్యాలోని బాల్టిక్ సీ పోర్ట్‌లో చమురు లోడ్ చేసుకుంది. వాస్తవానికి ఇది చైనాలోని రిజావో పోర్ట్‌కు వెళ్లాల్సి ఉంది. అయితే, భారత్ ఇటీవల రష్యా నుంచి చమురు దిగుమతులను భారీగా పెంచడంతో, ఈ నౌకను భారత్ వైపు మళ్లించినట్లు తెలుస్తోంది. ఇది మార్చి 21న కర్ణాటకలోని న్యూ మంగళూరు పోర్టుకు చేరుకోనుంది. అమెరికా ఆంక్షల సడలింపు నేపథ్యంలో, భారత రిఫైనరీలు ఇప్పటికే సుమారు 30 మిలియన్ బ్యారెళ్ల చమురును కొనుగోలు చేయడం విశేషం.

డార్క్ మోడ్‌లో ప్రయాణం:

ఇరాన్ యుద్ధ వాతావరణం నేపథ్యంలో హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణం ప్రమాదకరంగా మారింది. అయినప్పటికీ, గత కొన్ని రోజుల్లో సుమారు 90 నౌకలు ఈ జలసంధిని దాటినట్లు మారిటైమ్ డేటా వెల్లడించింది. ఆంక్షల నుంచి తప్పించుకునేందుకు ఈ నౌకలన్నీ తమ ట్రాకింగ్ వ్యవస్థలను ఆపివేసి (Dark Mode), అత్యంత రహస్యంగా ప్రయాణిస్తున్నాయి.

జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలు కూడా రష్యా చమురు కోసం పోటీ పడుతుండటంతో రానున్న రోజుల్లో అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Tags:    

Similar News