Meta Layoffs 2026: మెటాలో మళ్లీ లేఆఫ్‌ల బాంబు.. 16 వేల మంది ఉద్యోగులపై వేటు?

Meta Layoffs 2026: టెక్ దిగ్గజం మెటా ప్లాట్‌ఫామ్స్ (Meta Platforms) మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగాల కోతకు సిద్ధమవుతోంది.

Update: 2026-03-17 10:20 GMT

Meta Layoffs 2026: మెటాలో మళ్లీ లేఆఫ్‌ల బాంబు.. 16 వేల మంది ఉద్యోగులపై వేటు?

Meta Layoffs 2026: టెక్ దిగ్గజం మెటా ప్లాట్‌ఫామ్స్ (Meta Platforms) మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగాల కోతకు సిద్ధమవుతోంది. కృత్రిమ మేధస్సు (AI) ప్రభావంతో పనితీరు సామర్థ్యం పెరగడం, మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెంచాల్సిన నేపథ్యంలో.. కంపెనీ మొత్తం సిబ్బందిలో దాదాపు 20 శాతం మందిని తొలగించాలని యోచిస్తోంది. ఇదే గనుక జరిగితే, మెటాలో పనిచేస్తున్న సుమారు 16,000 మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది.

ఏఐ (AI) రాకతో మారిన సమీకరణాలు

ప్రస్తుతం మెటాలో 79,000 మంది సిబ్బంది ఉండగా, జనరేటివ్ AI రంగంలో అగ్రగామిగా ఎదగాలని సిఈఓ మార్క్ జుకర్‌బర్గ్ లక్ష్యంగా పెట్టుకున్నారు. "గతంలో భారీ టీమ్ అవసరమైన పనులను, ఇప్పుడు ఏఐ సాయంతో ఒక్క ప్రతిభావంతుడైన వ్యక్తి పూర్తి చేయగలడు" అని జుకర్‌బర్గ్ ఇటీవల వ్యాఖ్యానించడం ఈ లేఆఫ్‌ల సంకేతాలకు బలం చేకూరుస్తోంది. 2028 నాటికి డేటా సెంటర్ల కోసం ఏకంగా 600 బిలియన్ డాలర్ల భారీ వ్యయాన్ని మెటా ప్లాన్ చేస్తోంది.

వరుసగా మూడోసారి కోతలు

మెటాలో ఉద్యోగాల కోత విధించడం ఇది కొత్తేమీ కాదు.

2022 నవంబర్: 11,000 మంది (13%) తొలగింపు.

2023: 'Year of Efficiency' పేరుతో మరో 10,000 మంది తొలగింపు.

ప్రస్తుతం: మరో 16,000 మందిని ఇంటికి పంపే యోచనలో కంపెనీ ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా (రాయిటర్స్) కథనాలు వెల్లడించాయి. అయితే దీనిపై మెటా నుండి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

టెక్ రంగంలో కొనసాగుతున్న సంక్షోభం

ఒక్క మెటా మాత్రమే కాదు, అటు అమెజాన్ (16,000 కోతలు), ఇటు ఫిన్‌టెక్ దిగ్గజం బ్లాక్ (Block, Inc.) వంటి కంపెనీలు కూడా ఏఐ కారణంగా సిబ్బందిని తగ్గిస్తున్నాయి. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మానవ వనరుల అవసరం తగ్గుతుండటం ఇప్పుడు ఐటీ ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తోంది.

Full View


Tags:    

Similar News