Donald Trump: మాకు ఎవరి సాయం అవసరం లేదు, మేమే శక్తివంతమైన దేశం.. ట్రంప్ మాస్ వార్నింగ్
Donald Trump: ఇరాన్‌పై ఇజ్రాయెల్ చేపట్టిన దాడులు ఇప్పుడు అమెరికాకు ప్రతిష్టాత్మకంగా మారుతోంది. ఓవైపు అమెరికా, ఇజ్రాయెల్ ఎన్ని దాడులు చేస్తున్న ఇరాన్ మాత్రం తగ్గేది లే అన్నట్లు వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే తమ మిత్ర దేశాలకు ట్రంప్ ఒక వార్నింగ్ ఇచ్చారు.
Donald Trump: మాకు ఎవరి సాయం అవసరం లేదు, మేమే శక్తివంతమైన దేశం.. ట్రంప్ మాస్ వార్నింగ్
Donald Trump: ఇరాన్‌పై ఇజ్రాయెల్ చేపట్టిన దాడులు ఇప్పుడు అమెరికాకు ప్రతిష్టాత్మకంగా మారుతోంది. ఓవైపు అమెరికా, ఇజ్రాయెల్ ఎన్ని దాడులు చేస్తున్న ఇరాన్ మాత్రం తగ్గేది లే అన్నట్లు వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే తమ మిత్ర దేశాలకు ట్రంప్ ఒక వార్నింగ్ ఇచ్చారు.
హార్ముజ్ జలసంధి ఉద్రిక్తతలు
మధ్యప్రాచ్యంలో పెరిగిన యుద్ధ పరిస్థితుల వల్ల ప్రపంచానికి కీలకమైన హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) తీవ్ర ఉద్రిక్తతలకు కేంద్రంగా మారింది. ఈ మార్గం ద్వారా ప్రపంచంలో దాదాపు 20% ఆయిల్ రవాణా జరుగుతుంది.
ఇరాన్ ఈ మార్గాన్ని అడ్డుకోవడంతో ఆయిల్ సరఫరా అంతరాయం ఏర్పడి ధరలు భారీగా పెరుగుతున్నాయి.
మిత్రదేశాలకు ట్రంప్ పిలుపు కానీ..
ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మిత్రదేశాలను హార్ముజ్ జలసంధికి యుద్ధ నౌకలు పంపాలని కోరారు. ఈ మార్గాన్ని తిరిగి తెరవడానికి సహాయం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కానీ జర్మనీ, స్పెయిన్, ఇటలీ వంటి ముఖ్య దేశాలు ఈ అభ్యర్థనను తిరస్కరించాయి. తక్షణం నౌకలు పంపే ప్రణాళికలేదని స్పష్టం చేశాయి.
“మాకు ఎవరి సహాయం అవసరం లేదు”
మిత్రదేశాల స్పందనపై ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అమెరికా ప్రపంచంలోనే శక్తివంతమైన దేశమని, అత్యంత బలమైన సైన్యం తమదేనని చెప్పారు. “మాకు ఎవరి అవసరం లేదు” అని ఆయన స్పష్టం చేశారు.
అయితే మిత్రదేశాలు కష్టసమయంలో ఎలా స్పందిస్తాయో తెలుసుకోవడానికి ఈ పిలుపు ఇచ్చానని కూడా తెలిపారు. కూటమిలో చేరినప్పటికీ, ఉత్తర అట్లాంటిక్ ఒప్పంద సంస్థ (నాటో) సభ్య దేశాలు అమెరికాకు సహాయం చేయవని, అలాగే సామూహిక రక్షణ అనే భావనను ఆయన పునరుద్ఘాటించారు.
NATO దేశాలపై విమర్శలు
ట్రంప్, NATO సభ్య దేశాలపై కూడా విమర్శలు చేశారు. సంయుక్త రక్షణ అనే ఆలోచన ఉన్నా, అవసరమైనప్పుడు మద్దతు ఇవ్వడం లేదని అన్నారు. జర్మనీ చాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ ఈ విషయమై మాట్లాడుతూ.. ఈ యుద్ధానికి సంబంధించి ఐక్యరాజ్యసమితి, యూరోపియన్ యూనియన్, NATO అనుమతి లేదని తెలిపారు. ఇక యూకే కూడా ప్రారంభంలో సహాయం చేయలేదని ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రపంచంపై పెరుగుతున్న ఒత్తిడి
అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై దాడులు జరిపిన తర్వాత పరిస్థితి మరింత ఉద్రిక్తమైంది. ఇరాన్ ప్రతిగా క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. అదే సమయంలో హోర్ముజ్ మార్గం మూసివేయడం, వాణిజ్య నౌకలపై దాడులు చేయడంతో ఆయిల్ సరఫరాకు బ్రేక్ పడింది. ఇవి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.