వైద్యం ముసుగులో లైంగిక దాడులు.. 48 మంది మహిళా రోగులపై లైంగిక దాడులు

Krishna Singh: వైద్యుడంటే దేవుడితో సమానం.. వైద్యులకు సమాజంలో ఎంతో గౌరవం ఇస్తారు అలానే స్కాట్లాండ్‌లో భారతీయ సంతతి వైద్యుడికి మంచి పేరుంది.

Update: 2022-04-15 09:33 GMT

వైద్యం ముసుగులో లైంగిక దాడులు.. 48 మంది మహిళా రోగులపై లైంగిక దాడులు

Krishna Singh: వైద్యుడంటే దేవుడితో సమానం.. వైద్యులకు సమాజంలో ఎంతో గౌరవం ఇస్తారు అలానే స్కాట్లాండ్‌లో భారతీయ సంతతి వైద్యుడికి మంచి పేరుంది. అతడికి అత్యంత ప్రతిష్టాత్మకమైన బ్రిటీష్‌ రాయల్‌ మెంబరుషిప్‌ కూడా ఉంది. ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే మరోవైపు అతడో కామ పిశాచి. వైద్యం కోసం వచ్చిన రోగులపై తన కామ ప్రవృత్తిని చూపుతాడు. పరీక్షల పేరిట ఎక్కడో తడుముతాడు.. ముద్దులు పెడుతాడు.. ఏదో చూడాలంటాడు.. అంతేకాదు.. అసభ్యకరమైన మాటలతో రోగులను ఇబ్బంది పెడుతాడు. 35 ఏళ్లలో 48 మంది మహిళలపై లైంగిక దాడులు చేశాడు స్కాట్లాండ్‌లో భారత సంతతికి చెందిన 72 ఏళ్ల కృష్ణ సింగ్‌. వైద్య వృత్తికి మాయని మచ్చను తెచ్చిన కృష్ణ సింగ్‌కు కఠిన శిక్షలు వేయాలంటూ పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.

స్కాట్లాండ్‌లోని ఉత్తర లానర్క్‌షైర్‌లో భారతతి సంతతికి చెందిన కృష్ణ సింగ్‌ 1983 నుంచి వైద్య సేవలు అందిస్తున్నాడు. స్కాట్లాండ్‌లో కృష్ణసింగ్‌కు ఎంతో మంచి పేరుంది. అంతేకాదు అతడి వైద్య సేవలను మెచ్చి బ్రిటన్‌లోని అత్యంత గౌరవ ప్రదమైన బ్రిటీష్‌ సామ్రాజ్య సభ్యత్వం-ఎంబీఈ కూడా అక్కడి ప్రభుత్వం ప్రధానం చేసింది. అయితే అతడు లైంగికంగా వేధిస్తున్నట్టు 2018లో ఓ మహిళ ఫిర్యాదు చేసింది. నాటి నుంచి కృష్ణ సింగ్‌పై దర్యాప్తు ప్రారంభమైంది. కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వైద్య పరీక్షల పేరిట బాధిత మహిళలకు ముద్దులు పెట్టడం శరీర భాగాలను తడమడం, పరీక్షల పేరిట ఎక్కడో చూడాలని కోరేవాడని, అసభ్యంగా మాట్లాడేవాడని ప్రాసిక్యూటర్‌ తెలిపారు. అసుపత్రిలోని ఎమర్జెన్సీ విభాగమైనా, ఇళ్లకు హోం విజిట్‌కు వెళ్లినా ఇలానే ప్రవర్తించేవాడని స్పష్టం చేశారు.

అయితే రోగులు తనను తప్పుగా అర్థం చేసుకున్నారని ఈ వృద్ధ డాక్టర్‌ వాదిస్తున్నారు. తాను ఎలాంటి లైంగిక దాడికి పాల్పడలేదంటున్నాడు. తాను భారత్‌లో వైద్య శిక్షణలో బోధించిన పద్ధతులనే అనుసరించినట్టు తనకు తాను సమర్థించుకున్నాడు. కృష్ణసింగ్‌పై 35 ఏళ్ల కాలంలో 48 మంది మహిళా రోగులపై లైంగిక నేరాలకు పాల్పడ్డారు. అతడి వృత్తిలో లైంగిక నేరాలు చేయడమే ప్రధానంగా పెట్టుకున్నాడు. కృష్ణ సింగ్‌పై ఇప్పటివరకు 54 లైంగిక వేధింపులు నిర్ధారణ అయ్యాయి. మరో తొమ్మది ఆరోపణలపై ఆధారాలు లేకపోవడం గమనార్హం. అయితే కృష్ణసింగ్‌ కేసు తుది తీర్పును గ్లాస్గో హైకోర్టు వచ్చే నెలకు వాయిదా పడింది. కృష్ణసింగ్‌ బెయిల్‌ కోసం యత్నించగా పాస్‌పోర్ట్‌ అప్పగించాలనే షరతుతో కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

Tags:    

Similar News