Russia-Ukraine: చెర్నోబిల్ అణు విద్యుత్ ప్లాంట్‌ను స్వాధీనం చేసుకున్న రష్యా

Russia-Ukraine: బెలారస్‌ వైపు నుంచి ఉక్రెయిన్‌లోకి రష్యా బలగాలు

Update: 2022-02-25 04:36 GMT

చెర్నోబిల్ అణు విద్యుత్ ప్లాంట్‌ను స్వాధీనం చేసుకున్న రష్యా

Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తూనే ఉంది. బెలారస్ వైపు నుంచి రష్యా బలగాలు ఉక్రెయిన్‌లోకి ప్రవేశించాయి. ఉక్రెయిన్ వేర్పాటువాద ప్రాంతాల్లోకి రష్యా బలగాలు చేరాయి. ఉక్రెయిన్ సైనిక స్థావరాలు, ఆయుధ కర్మాగారాలపై క్షిపణులతో దాడి చేస్తోంది రష్యా. చెర్నోబిల్‌ అణు విద్యుత్ ప్లాంట్‌ను స్వాధీనం చేసుకుంది.

నాటో దేశాలపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మండిపడ్డారు. నాటో దేశాలు కూడా సాయం చేసేందుకు ముందుకు రావడం లేదన్నారు. నాటోలో సభ్యత్వం ఇవ్వడానికి ఎవరు ముందుకొచ్చారని ప్రశ్నించారు. రష్యాతో పోరాటంలో ఒంటరయ్యామని... రష్యాకు అన్ని దేశాలు భయపడుతున్నాయన్నారు జెలెన్‌స్కీ. మరోవైపు రష్యాలోనే పుతిన్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు మొదలయ్యాయి. పీటర్స్‌బర్గ్‌లో ఆందోళనకారులపై రష్యా సైన్యం ఉక్కుపాదం మోపుతోంది. 

Tags:    

Similar News