Sheikh Tamim Net Worth: ఖతార్ అధ్యక్షుడు అల్ థానీ.. గోల్డెన్ ప్యాలెస్, విలాసవంతమైన నౌక.. ఆస్తుల విలువ తెలుసా?
Sheikh Tamim Net Worth: అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ ఖతర్ అధ్యక్షుడు. భారత పర్యటనకు వచ్చిన అల్ థానీకి భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎయిర్ పోర్టుకు వెళ్లి స్వాగతం పలికారు.
Sheikh Tamim Net Worth: ఖతార్ అధ్యక్షుడు అల్ థానీ.. గోల్డెన్ ప్యాలెస్, విలాసవంతమైన నౌక.. ఆస్తుల విలువ తెలుసా?
Sheikh Tamim Net Worth: అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ ఖతర్ అధ్యక్షుడు. భారత పర్యటనకు వచ్చిన అల్ థానీకి భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎయిర్ పోర్టుకు వెళ్లి స్వాగతం పలికారు. రెండు దేశాల మధ్య పలు అంశాలపై ఒప్పందాలు జరగనున్నాయి. ఖతర్ ను పాలిస్తున్న అల్‌థానీ వంశం ఆస్తుల విలువ ఎంతో తెలుసా? ఆ దేశంలో ఉన్న సహజ వనరులతో పాటు ఇతర దేశాల్లో పెట్టుబడుల ఆధారంగా ప్రపంచంలోని సంపన్న కుటుంబాల్లో అల్ థానీ ఫ్యామిలీ ఒకటిగా నిలిచింది.
గోల్డెన్ ప్యాలెస్‌లో నివాసం
ఖతర్ అధ్యక్షుడు అల్ థానీ కుటుంబం దోహాలోని రాయల్ గోల్డెన్ ప్యాలెస్ లో నివాసం ఉంటుంది. ఈ ప్యాలెస్ లోని ఇంటీరియర్ బంగారం తాపడంతో ఉంటుంది. అందుకే దీన్ని గోల్డెన్ ప్యాలెస్ అని పిలుస్తారు. దీని విలువ ఒక బిలియన్ డాలర్లు ఉంటుంది. ఈ ప్యాలెస్ లో 15 భవనాలు ఉంటాయి. ఇందులో 500 కార్లను పార్కింగ్ చేసే వీలుంది. ఒమన్ లో ఈ కుటుంబానికి వైట్ ప్యాలెస్ కూడా ఉంది. లండన్ లో కూడా ఈ కుటుంబం 140 మిలియన్ డాలర్ల విలువైన బంగ్లాను కొనుగలు చేశారు. ఇందులో 17 బెడ్ రూమ్స్, 14 లాంజ్ లు, స్విమ్మింగ్ పూల్స్ వంటి సౌకర్యాలు కూడా ఉంటాయి.
విలాసవంతమైన నౌక
ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన నౌక కూడా ఈ కుటుంబానికి ఉంది. దీని విలువ 400 మిలియన్ డాలర్లు. ఈ నౌకలో హెలికాప్టర్ కూడా ల్యాండ్ చేసుకొనే వెసులుబాటు కూడా ఉంది. 2019లో దోహలోని షిప్ యార్డులో జరిగిన అగ్ని ప్రమాదంలో మూడు పడవలు అగ్నికి ఆహుతయ్యాయి. ఒక్కో పడవ విలువ 10 లక్షలు.
ప్రత్యేక విమాన సంస్థ
ఖతర్ రాజకుటుంబం 1977లో ప్రత్యేక విమానయాన సంస్థను నిర్వహిస్తోంది. ఖతర్ అమీరి ఫ్లైట్ ఈ సంస్థ పేరు. మూడు బోయింగ్ 747-8 జెట్ విమానాలతో పాటు 14 విమానాలు ఈ సంస్థలో ఉన్నాయి. ఈ విమానాయాన సంస్థ రాజకుటుంబం, ప్రభుత్వ అధికారులకుమాత్రమే తన సేవలను అందిస్తోంది. ఈ సంస్థ నిర్వహించే బోయింగ్ 747-8 మోడల్ ఫ్లైట్ ధర 400 మిలియన్ డాలర్లు ఉంటుంది. ఇక మామూలు విమానాల ధరలు 100 నుంచి 500 మిలియన్ డాలర్ల వరకు ఉంటాయి.
టాప్ కార్లు వీరి సొంతం
ప్రపంచంలోని టాప్ కార్లు ఈ రాజకుటుంబం వద్ద ఉన్నాయి. రూల్స్ రాయిస్, చిరాన్, లంబోర్గిని, బుగాటి , మెర్సిడెస్ AMG 6x6 వంటి సంస్థల కార్లు వీరి వద్ద ఉన్నాయి.
పెయింటింగ్స్ పై బిలియన్లు ఖర్చు
పెయింటింగ్స్ తోపాటు పెయింటింగ్స్ సేకరణ కోసం బిలియన్లను ఈ రాజకుటుంబం ఖర్చు చేసింది. పాల్ సెజాన్ పెయింటింగ్స్ ది కార్డ్ ప్లేయర్స్ ను 2011లో 250 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు.మార్క్ రోత్కో వైట్ సెంటర్ పెయింట్ ను 72.8 మిలియన్లను కొన్నారు. ఆండీ వార్హోల్ మెన్ ఇన్ హర్డ్ లైఫ్ పెయింటింగ్ ను 63.4 మిలియన్లకు కొనుగోలు చేశారు.
క్రీడలపై ఆసక్తి
2004లో షేక్ తమీమ్ ఖతర్ స్పోర్ట్స్ ఇన్వెస్ట్ మెంట్ ను ఏర్పాటు చేశారు. ఇది ఇప్పడు పారిస్ సెయింట్ జర్మైన్ పుట్ బాల్ క్లబ్ ను కలిగి ఉంది. 2022లో పుట్ బాల్ ప్రపంచకప్ పోటీలను నిర్వహించింది. తమ ప్రాంతంలో క్రీడా స్టేడియాల్లో మౌలిక వసతుల కోసం 12 ఏళ్లలో 300 బిలియన్ డాలర్లను ఖర్చు చేసింది.
ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడులు
ఖతర్ ఇన్వెస్ట్ మెంట్ అథారిటీ , దేశ సావరిన్ వెల్త్ ఫండ్ ద్వారా ఈ దేశం ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టింది. 450 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆయా సంస్థల్లో పెట్టినట్టుగా నివేదికలు చెబుతున్నాయి. బార్కేస్, వోక్స్ వ్యాగన్, హీత్రో, ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ సహా పలు ప్రముఖ కంపెనీల్లో ఈ కుటుంబం వాటాలను కలిగి ఉంది. లండన్ లోని ఐకానిక్ హారోడ్స్ డిపార్ట్ మెంట్ స్టోర్ ను నిర్వహిస్తున్నారు.