Operation Sindoor: జమ్మూకశ్మీర్ లోని పహల్గామ్ లో పర్యాటకులపై ఉగ్రదాడులు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఉగ్రదాదిలో 26 మంది అమాయకులు మరణించారు. ఏప్రిల్ 22వ తేదీన జరిగిన ఈ ఘటన తర్వాత దేశం మొత్తం కోపం రగిలిపోయింది. ఈ ఘటన జరిగిన సరిగ్గా 13 రోజుల తర్వాత భారత ఆర్మీ ఉగ్రవాదులకు సరైన గుణపాఠం చెప్పింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ లోని ఉగ్రవాదుల స్థావరాలను పేల్చేసింది. ఈ దాడుల్లో పదుల సంఖ్యలో ఉగ్రవాదులు మరణించినట్లు తెలుస్తోంది. దేశం మొత్తం ఆపరేషన్ సింధూర్ పై ప్రశంసలు కురిపిస్తోంది.
ఈ దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాడి వీడియోలతోపాటు మరికొన్ని పాక్ ప్రజల స్పందనలకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఓ పాకిస్తాన్ న్యూస్ యాంకర్ ఆపరేషన్ సింధూర్ గురించి చెబుతూ వెక్కి వెక్కి ఏడ్చిన వీడియో కూడా వైరల్ అయ్యింది. అది కూడా షోలోనే ఉండగా ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. అయితే ఆమె పాకిస్తాన్ యాంకరా కాదా అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు.
సోషల్ మీడియాలో మాత్రం ఆమె పాకిస్తాన్ యాంకర్ అని..ఆపరేషన్ సింధూర్ ప్రభావం గురించి మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకుందని ప్రచారం జోరుగా జరుగుతోంది. అందులో ఎంత వరకు నిజం ఉందనేది మాత్రం తెలియరాలేదు.