New virus Found in China: మహామ్మరుల పుట్టిల్లుగా మారుతున్న చైనా.. మరో కొత్త వైరస్!

Update: 2020-07-06 05:12 GMT

New virus Found in చైనా : చైనాలో మరో కొత్తరకం వ్యాధి పుట్టుకొచ్చింది. బుబోనిక్ ప్లేగు విజృంభణతో అధికార యంత్రాంగం అప్రమత్తం అయింది. ఉత్తర చైనాలోని ఒక నగరంలో ఆదివారం బుబోనిక్ ప్లేగు వ్యాధి ఉన్నట్లు అనుమానించిన అధికార యంత్రాంగం అప్రమత్తం అయ్యిందని చైనా అధికారిక మీడియా ప్రకటించింది. అనుమానాస్పద బుబోనిక్ ప్లేగు కేసు బయోన్నూర్ లోని ఒక ఆసుపత్రిలో శనివారం వెలుగుచూసింది.

ధృవీకరించబడిన కేసులలో 27 ఏళ్ల నివాసి మరియు అతని 17 ఏళ్ల సోదరుడు, వారి ప్రావిన్స్లోని రెండు వేర్వేరు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారని ఆరోగ్య అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇన్నర్ మంగోలియా అటానమస్ రీజియన్ అయిన బయన్నూర్ ప్రాంతంలో ప్లేగు నివారణ, నియంత్రణ గురించి 3వ స్థాయి హెచ్చరికను ప్రకటించినట్లు చైనా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న పీపుల్స్ డైలీ ఆన్‌లైన్ వెల్లడించింది. 2020 సంవత్సరం చివరి వరకు ఈ వైరస్ కొనసాగుతుందని స్థానిక ఆరోగ్య అధికార యంత్రాంగం ప్రకటించింది. ప్రస్తుతం, ఈ నగరంలో మానవ ప్లేగు మహమ్మారి వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. ప్రజలు దాని స్వీయ-రక్షణ అవగాహన సామర్థ్యాన్ని మెరుగుపరచాలి అసాధారణ ఆరోగ్య పరిస్థితులను వెంటనే నివేదించాలని అని స్థానిక హెల్త్ డిపార్ట్మెంట్ అధికారం తెలిపింది.

పశ్చిమ మంగోలియాలోని ఖోవ్డ్ ప్రావిన్స్‌లో వెలుగుచూసిన రెండు బుబోనిక్ ప్లేగు కేసులు ల్యాబ్ పరీక్ష ఫలితాల ద్వారా నిర్ధారించబడిందని జూలై 1 న ప్రభుత్వ జిన్హువా వార్తా సంస్థ తెలిపింది. ఈ సోదరులు మార్మోట్(ఎలుక) మాంసం తిన్నారని ,మార్మోట్ మాంసం తినవద్దని ప్రజలను అధికారులు హెచ్చరించారు. వారితో సంబంధం ఉన్న మొత్తం 146 మందిని స్థానిక ఆసుపత్రులలో వేరుచేసి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

బుబోనిక్ ప్లేగు అనేది బాక్టీరియా వ్యాధి, ఇది మార్మోట్స్ వంటి అడవి ఎలుకలపై నివసించే ఈగలు ద్వారా వ్యాపిస్తుందని అధికారులు ధృవీకరించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకారం, సమయానికి చికిత్స చేయకపోతే ఇది 24 గంటలలోపు ఒక వ్యక్తిని చంపగలదని తెలిపారు. పశ్చిమ మంగోలియన్ ప్రావిన్స్ బయాన్-ఉల్గిలో గత సంవత్సరం ముడి మార్మోట్ మాంసం తిని ఒక జంట బుబోనిక్ ప్లేగుతో మరణించింది. పందులలో ఇన్ఫ్లుఎంజా వైరస్ వల్ల కలిగే మరో సంభావ్య మహమ్మారిపై చైనా పరిశోధకులు ముందస్తు హెచ్చరిక జారీ చేసిన తరువాత బుబోనిక్ ప్లేగు వార్త వెలుగులోకి వచ్చింది.

Tags:    

Similar News