100 సంవత్సరాలకు ఒక అంటు వ్యాధి..

100 సంవత్సరాలకు ఒక అంటు వ్యాధి..
x
Highlights

విశ్వాన్ని నాశనం చేయడానికి ప్రతి వంద ఏళ్లకు ఒక సారి ఏదో ఒక మహమ్మారి అవతారం ఎత్తుతూనే ఉంది.

విశ్వాన్ని నాశనం చేయడానికి ప్రతి వంద ఏళ్లకు ఒక సారి ఏదో ఒక మహమ్మారి అవతారం ఎత్తుతూనే ఉంది. ఏదో ఒక అంటు వ్యాధి ప్రతి వంద ఏండ్లను ఒక సారి ప్రపంచంలోని సగం జనాభాను మట్టుపెడుతుంది. ఈ నేపథ్యంలోనే 1720వ సంవత్సరంలో ఒక్క సారిగా లక్షల మందిని ప్రాణాలను కబలించింది ప్లేగు వ్యాధి. ఆ తరువాత సరిగ్గా వంద ఏండ్లు కాగానే 1820 వ సంవత్సరం కలరా ప్రబలింది. అనంతరం మళ్లీ వందేళ్లకు 1920వ సంవత్సరంలో స్పానిష్‌ ఫ్లూ పంజా విసిరింది. ఇప్పటికీ సరిగ్గా వందేళ్లు గడిచింది 2020లో అడుగు పెట్టాం ఈ సారి చైనా పుట్టింది మహమ్మారి.

1720లో ప్లేగు వ్యాధి

నాలుగు వందల ఏండ్లు గడిచినా ప్లేగు వ్యాధి గురించి ఎవరూ మర్చిపోలేదు. 1720లో యూరప్ ఫ్రాన్సులోని మర్సెయిల్స్ లో బయటపడిన ఈ వ్యాధి ఆ ఒక్క నగరంలోనే 50 వేల మంది ప్రాణాలకు కబలించింది. లక్షల మందిని అనారోగ్యం పాలు చేసింది. అప్పుడు అది సృష్టించిన బీభత్సం చిన్నది కాదు. ఆ తరువాత ఈ ప్లేగు వ్యాధి ప్రపంచవ్యాప్తంగా విస్తరించి అందరిని వణికించింది. ఈ ప్రాణాంతకమైన వ్యాధి ఎర్సీనియా పెస్టిస్ (పాస్చురెల్లా పెస్టిస్) అనే బాక్టీరియా వలక కలుగుతుంది. ఈ వ్యాధి ఎలుకల ద్వారా వ్యాపిస్తుంది, మానవులకు ఈగల ద్వారా చేరుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది మరణానికి కారణమై కొన్ని ప్రాంతాలలో మహమ్మారిగా స్థిరపడింది. మొత్తం మీద ఈ వైరస్ ద్వారా ఫ్రాన్సు వ్యాప్తంగా లక్షమంది ఈ వ్యాధితో చనిపోయారు.

1820లో కలరా వ్యాధి

ప్లేగు వ్యాధి బీభత్సం సృష్టించి సరిగ్గా వందేళ్లు పూర్తి కాగానే కలరా వ్యాధి పుట్టుకొచ్చింది. ఫిలిప్పైన్స్ థాయ్ లాండ్ ఇండోనేషియా దేశాల్లో ప్రబలించిన ఈ మహమ్మారి లక్షల మందిని బలితీసుకుంది. ఇప్పటికీ ఈ వ్యాధి ప్రపంచంలోని ఆఫ్రికా ఖండంలో నమోదవుతునే ఉన్నాయి.

ఈ వ్యాధిని అతిసార వ్యాధి అని కూడా అంటారు. ఈ వ్యాధి విబ్రియో కలరే అను బాక్టీరియా వలన కలుగుతుంది. ఇది నీరు ద్వారా లేదా ఆహారం ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఇది అత్యంత వేగంగా వ్యాప్తి చెందే ప్రాణాంతక వ్యాధి. ఆతి విరోచనాలతో మొదలయ్యే ఈ వ్యాధి సోకిన వెంటనే వైద్య సహాయం అందకపోతే రోగి మరణించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

1920లో స్పానిష్ ఫ్లూ

ఇక కలరా వ్యాధి వచ్చి మరో వందేళ్లు పూర్తికాకుండానే ప్రబలించింది. అప్పటి వరకూ వచ్చిన వ్యాధుల కంటే ఈ వ్యాధి ఎక్కువ ప్రాణ నష్టాన్ని కలిగించిందనే చెప్పుకోవాలి. స్పానిష్ ఫ్లూ కారణంగా సుమారు 100 కోట్ల మంది ఈ వ్యాది బారిన పడగా, దాదాపుగా ఒక కోటి మంది మృత్యువాత పడ్డారు. ఈ సృష్టిలోనే అతి భయంకర వ్యాధిగా ఆ వ్యాధి మగిలిపోయింది. పెద్ద తరహాలో విషాదం మిగిల్చిన అతి భయంకరమైన ఈ వ్యాధి ఇప్పటికి అందరికీ గర్తుండి పోయింది. ఫ్రాన్స్‌లోని ఎటపుల్స్‌లోని ప్రధాన UK ట్రూప్ స్టేజింగ్, హాస్పిటల్ క్యాంప్‌ను స్పానిష్ ఫ్లూ కేంద్రంగా పరిశోధకులు సిద్ధాంతీకరించారు.

2020లో కరోనా వైరస్

స్పానిష్ ఫ్లూ కల్లోలం సృష్టించి సరిగ్గా వందేళ్లు గడిచి 2020 సంవత్సరంలో అడుగుపెట్టాం. మళ్లీ ఇప్పుడు చైనాలోని వూహాన్ లో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తుంది. ప్రపంచంలోని దేశాలకు దావాణంగా వ్యాపిస్తుంది. ఈ వైరస్ పుట్టిన కొన్ని రోజులకే వేల మందిని పొట్టలో పెట్టుకుంది. దీనితో ప్రపంచం మొత్తం మరోసారి భయాందోళనకు గురవుతుంది. ఇప్పటికీ మొదటిదశలో ఉన్న ఈ మహమ్మారి ఇంకా ఎంత మంది ప్రాణాలను బలితీసుకోనుందో.. దీనికి ఎప్పుడు మందులు కనుక్కోనున్నారో చూడాల్సిందే..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories