Nepal Gen Z Protest: నేపాల్‌లో రాజకీయ సంక్షోభం? దుబాయ్‌కి ప్రధాని కేపీ ఓలీ..!
Nepal Gen Z Protest: నేపాల్‌లో విధ్వంస కాండ ఆగడం లేదు. సోషల్‌మీడియాపై బ్యాన్ ఎత్తివేసినా నిరసన సెగలు చల్లారలేదు.
Nepal Gen Z Protest: నేపాల్‌లో విధ్వంస కాండ ఆగడం లేదు. సోషల్‌మీడియాపై బ్యాన్ ఎత్తివేసినా నిరసన సెగలు చల్లారలేదు. ఖాట్మండులో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. నిన్న యువత చేసిన నిరసనను అడ్డుకున్న పోలీసులు కాల్పులు జరపగా.. 19 మంది మరణించారు. దాంతో ప్రజాగ్రహం కట్టలు తెంచుకంది. వెంటనే ప్రధాని కేపీ ఓలీ పదవి నుంచి దిగిపోవాలంటూ ప్రజలు రోడ్డెక్కారు. దాంతో ప్రభుత్వం ఆర్మీని మోహరించింది. అయితే నిరసనకారులను అడ్డుకోవడానికి వచ్చిన భద్రతా బలగాలపైకి రాళ్లు విసిరారు. దాంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మాజీ ప్రధాని ప్రచండ ఇంటిపై అటాక్ చేశారు నిరసనకారులు.
మరోవైపు నిన్న జరిగిన పరిణామాలకు ఇప్పటికే ప్రభుత్వంలో నలుగురు మంత్రులు రాజీనామా చేశారు. ప్రధాని కేపీ శర్మ ఓలీ కూడా దాదాపుగా రాజీనామాకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఆల్‌పార్టీ మీటింగ్‌కు పిలుపునిచ్చిన కేపీ శర్మ.. నేపాల్‌ను వీడాలన్న ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఆయన ఇప్పటికే దుబాయ్‌లో తలదాచుకునేందుకు అక్కడి ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు తాజా ఉద్రిక్తతలతో ఇండియా-నేపాల్ బోర్డర్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో సరిహద్దుల్లోని భారతీయులు జాగ్రత్తగా ఉండాలని భారత కేంద్ర ప్రభుత్వం సూచనలు చేసింది.