Military plane crashes : ఘోర ప్రమాదం : కూలిన విమానం.. 22 మంది మృతి

ఘోర ప్రమాదం : కూలిన విమానం.. 22 మంది మృతి.. శుక్రవారం సాయంత్రం 28 మంది ప్రయాణిస్తున్న సైనిక రవాణా విమానం కూలిపోయింది. దీంతో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి..

Update: 2020-09-26 01:48 GMT

ఈశాన్య ఉక్రెయిన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. శుక్రవారం సాయంత్రం 28 మంది ప్రయాణిస్తున్న సైనిక రవాణా విమానం కూలిపోయింది. దీంతో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి, మంటల ధాటికి విమానంలో ఉన్న 22 మంది మృతి చెందారని అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విమానంలో వైమానిక దళ పైలట్లు, క్యాడెట్లు ఉన్నారని అంతర్గత వ్యవహారాల శాఖ తెలిపింది. ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడటంతో వారిని ఆసుపత్రికి తరలించారు..

ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉంది. అలాగే ప్రమాదంలో గాయపడిన మరో నలుగురు వ్యక్తుల కోసం అన్వేషణ కొనసాగుతోందని ఉప అంతర్గత మంత్రి అంటోన్ గెరాష్చెంకో తెలిపారు. సైనిక విమానాశ్రయం నుండి 2 కి.మీ (1.2 మైళ్ళు) దూరంలో ఈ ప్రమాదం జరిగిందని ఉక్రెయిన్ స్టేట్ ఎమర్జెన్సీ సర్వీస్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రమాదానికి గురైన విమానం శిక్షణలో ఉందని అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కి ప్రాథమిక సమాచారాన్ని ఉటంకిస్తూ ఒక ప్రకటనలో తెలిపారు. 

Tags:    

Similar News