Pakistan: పాకిస్తాన్‌ చరిత్రలో తొలి అడుగు

Pakistan: సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తిగా జస్టిస్‌ అయేషా మాలిక్‌ ప్రమాణం

Update: 2022-01-25 02:05 GMT

పాకిస్తాన్‌ చరిత్రలో తొలి అడుగు

Pakistan: పాకిస్తాన్‌‌లో దేశ తొలి మహిళా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా అయేషా మాలిక్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజధాని ఇస్లామాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మాలిక్‌ ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె ఇప్పుడు పాకిస్తాన్ సుప్రీంకోర్టులో 16 మంది సహోద్యోగులతో కూడిన బెంచ్‌లో చేరారు. "ఇది ఒక పెద్ద అడుగు" అని న్యాయవాది, మహిళా హక్కుల కార్యకర్త నిఘట్ డాడ్ వెల్లడించారు. ఇదీ పాకిస్తాన్ న్యాయవ్యవస్థ చరిత్రలో పెద్ద రోజు అని అభివర్ణించారు.

అయేషా మాలిక్ తన విద్యను హార్వర్డ్ యూనివర్సిటీలో పూర్తి చేసింది. గత రెండు దశాబ్దాలుగా ఆమె పాకిస్థాన్‌లోని లాహోర్‌లో హైకోర్టు న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్నారు. పంజాబ్ ప్రావిన్స్‌లో పితృస్వామ్య చట్టపరమైన ఆచారాలను మార్చిన ఘనత ఆమెది. గత ఏడాది, ఆమె అత్యాచార బాధితురాలికి వివాదాస్పదమైన వైద్య పరీక్షను రద్దు చేశారు. ఇందుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు.

Tags:    

Similar News