Israel- Gaza: గాజా ఆసుపత్రిపై ఇజ్రాయెల్ దాడి.. హమాస్ కీలక నేత హతం

Update: 2025-03-24 02:26 GMT

Israel- Gaza: గాజాలోని ఖాన్ యూనిస్ నగరంలో ఉన్న అతిపెద్ద ఆసుపత్రిపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ దాడిలో ఒకరు మరణించారు. పదుల సంఖ్యలో రోగులు గాయపడ్డారు. ఈ మేరకు గాజా ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇజ్రాయెల్ దాడి కారణంగా ఆసుపత్రిలో సర్జికల్ భవనంలో మంటలు చెలరేగినట్లు తెలిపింది. అటు నాజర్ ఆసుపత్రిపై దాడి చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం కూడా ధ్రువీకరించింది. ఆసుపత్రిలో హమాస్ మిలిటెంట్లు కార్యకలాపాలు సాగిస్తున్నారని అందుకే దాడి చేసినట్లు వెల్లడించింది. గత 24గంటల్లో గాజా పట్టీలో ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడుల్లో 26 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో ఇప్పటి వరకు 50వేల మంది పాలస్తీయనియన్లు మరణించిన గాజా ఆరోగ్యశాఖ తెలిపింది. ఇంకా 1.13లక్షల మంది గాయపడినట్లు వివరించింది.

ఆదివారం ఖాన్ యూనిస్ నగరంపై ఇజ్రాయెల్ నిర్వహించిన దాడిలో హమాస్ కీలక నేత సలాహ్ అల్ బర్దావీల్ మరణించారు. ఆయనతోపాటు ఆయన భార్య కూడా ఈ దాడిలో మరణించారు. ఖాన్ యూనిస్ శరణార్థి శిబిరంలో జన్మించిన బర్దావీల్ , హమాస్ సీనియర్ నేత యాహ్వా సిన్వర్ కు సన్నిహితుడు. హమాస్ రాజకీయ విభాగానికి నాయకుడు కూడా. ఇజ్రాయెల్ దాడుల్లో సిన్వర్, ముస్తాహాలు మరణించినప్పటి నుంచి బర్ధావీలే హమాస్ లో కీలక నేతగా ఉంటున్నాడు.

Tags:    

Similar News