Shubhanshu Shukla Axiom 4 Mission: ఈ రోజు అంతరిక్ష కేంద్రంలోకి ఫాల్కన్ –9 వెళ్లేందుకు సిద్దం.. రాకెట్ పైలెట్‌గా మన భారతీయుడు శుభాంశు శుక్లా

Shubhanshu Shukla Axiom 4 Mission: మన ఇండియన్ ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా అంతరిక్షంలోకి అడుగుపెట్టేందుకు సిద్దమయ్యారు.

Update: 2025-06-25 05:00 GMT

Shubhanshu Shukla Axiom 4 Mission: మన ఇండియన్ ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా అంతరిక్షంలోకి అడుగుపెట్టేందుకు సిద్దమయ్యారు. యాక్సియం–4 (ఎఎక్స్–4) మిషన్‌లో భాగంగా శుక్లా మరో ముగ్గురు ఆస్ట్రోనాట్లతో కలిపి ఫాల్కన్ – 9 రాకెట్‌లో అంతరిక్ష కేంద్రానికి నేడు బయలుదేరనున్నారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తియినట్లు స్పేస్ ఎక్స్ ప్రకటించింది.

అమెరికాకు చెందిన యాక్సియం స్పేస్ ఈ మిషన్‌ను నిర్వహిస్తోంది. అయితే ఈ మిషన్‌లో ఇస్రో, నాసా, ఐరోపా అంతరిక్ష సంస్థల భాగస్వామ్యం కూడా ఉంది. బుధవారం మధ్యాహ్నం 12.01 గంటలకు ఈ ప్రయోగం జరగనుంది. ఈ ప్రయోగానికి అంతా సిద్దంగానే ఉందని, ఫ్లోరిడా నాసా కెన్నడీ స్పేస్‌లో ఈ రాకెట్ లాంచ్ అవనుందని స్పేస్ ఎక్స్ ప్రకటించింది. లిఫ్ట్ ఆఫ్‌కు వాతావరణం దాదాపు 90 శాతం అనుకూలించి ఉంది. అదేవిధంగా అన్ని మిషన్లు సక్రమంగా పనిచేస్తున్నాయి. ప్రతిక్షణం వాటిని సైంటిస్టులు పరిశీలిస్తూనే ఉన్నారు. అయితే మన భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 12.01 గంటలకు లాంచ్ అయిన రాకెట్ సాయంత్రం 4.30 గంటలకు అంతరిక్షకేంద్రంలోకి అనుసంధానం అవుతుందని స్పేస్ ఎక్స్ వెల్లడించింది.

ఢిల్లీకి చెందిన ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా కూడా ఈ మిషన్‌లో పాల్గొనడం విశేషం. శుక్లాతో పాటు మరో ముగ్గురు ఆయనతో ప్రయాణం చేస్తున్నారు. ఇందులో శుక్లా పైలెట్‌గా వ్యవహరిస్తున్నారు. వీరంతా అంతరిక్ష కేంద్రానికి చేరిన తర్వాత దాదాపు 14 రోజుల పాటు అక్కడ ఉండనున్నారు. పలు ప్రయోగాలు నిర్వహించనున్నారు. శుక్లా అంతరిక్ష ప్రయాణం విజయవంతం కావాలని ప్రధాని మోదీ తెలిపారు. అంతేకాదు స్కూల్ పిల్లలతో కలిసి మోదీ కూడా రాకెట్ లాంచింగ్‌ని వీక్షించనున్నారు.

ఫాల్కన్ –9 రాకెట్ లాంచింగ్ మొదట మే 29న జరగాల్సి ఉంది. కానీ, వాతావరణం సరిగా అనుకూలించకపోవడంతో దాన్ని నిలిపివేశారు. భూమి నుంచి బయలు దేరిన ఈ రాకెట్ దాదాపు 28 గంటలు ప్రయాణించి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో అనుసంధానమవుతుంది.

Tags:    

Similar News