Indian Army: చైనా సైన్యాన్ని ఎదుర్కోవడానికి త్రిశూల ఆయుధాలు

*భారత సైనికులపై ఇనుపరాడ్లు, ముల్ల కంచెలతో చైనా సైనికుల దాడి *చైనా సైనికులను సమర్థవంతంగా ఎదుర్కొన్న ఇండియా

Update: 2021-10-19 03:18 GMT

చైనా సైన్యాన్ని ఎదుర్కోవడానికి త్రిశూల ఆయుధాలు(ఫైల్ ఫోటో)

Indian Army: చైనా సైన్యాన్ని ఎదుర్కోవడానికి త్రిశూల ఆయుధాలను తయారు చేసింది ఇండియా. చైనా-ఇండియా మధ్య ఉన్న ఒప్పందాల కారణంగా సరిహద్దులో మారణాయుధాలు ఉపయోగించకూడదు. ఈ కారణంగానే గాల్వన్ లోయలో ఇరు దళాలకు మధ్య జరిగిన ఘర్షణలో భారత సైనికులపై ఇనుప రాడ్లు, ముల్ల కంచెలతో చైనా సైనికులు దాడికి దిగారు. ఆ సమయంలో చైనా సైనికులను ఇండియా సైనికులు సమర్థవంతంగా ఎదుర్కొన్నప్పటికీ, మరింత బలంగా తయారయ్యేందుకు త్రిశూల ఆయుధాలు తయారు చేస్తున్నారు.

ప్రాణాలకు ఎలాంటి హానీ లేని ఈ ఆయుధాలతో శత్రువులను మాత్రం తిప్పి కొట్టొచ్చని తయారీ దారులు అంటున్నారు. నూతనంగా తయారు చేసిన గ్లౌజ్ తొడుక్కొని ఒక్క పంచ్ ఇస్తే శత్రువులు మూర్చపోవాల్సిందేనట. ఇక నూతనంగా రూపొందించిన లాఠీలు కూడా మరింత సమర్థవంతంగా ఉంటాయని అంటున్నారు. తక్కువ బరువుతో, ఎక్కడికైనా రవాణా చేసే విధంగా వీటిని రూపొందించబోతున్నట్లు అపాస్టెరాన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తెలిపింది.

Tags:    

Similar News