USA: అమెరికాలో మరోసారి కాల్పుల మోత.. ముగ్గురి మృతి

USA: లాస్‌ వేగాస్‌లోని నెవాడా విశ్వవిద్యాలయం కాల్పులు

Update: 2023-12-07 12:47 GMT

USA: అమెరికాలో మరోసారి కాల్పుల మోత.. ముగ్గురి మృతి

USA: అమెరికాలో మళ్లీ కాల్పుల మోత మోగింది. గుర్తు తెలియని వ్యక్తి లాస్‌ వేగాస్‌లోని నెవాడా విశ్వవిద్యాలయం కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. కాల్పుల నుంచి తమ ప్రాణాలు కాపాడుకునేందుకు విద్యార్థులు పరుగులు తీసి సమీప గదుల్లో దాక్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. అయితే, చనిపోయిన వారిలో అనుమానితుడు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కేవలం యూనివర్సిటీలో మాత్రమే కాకుండా నగరంలో మరో చోట కూడా కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. దీంతో విశ్వవిద్యాలయంతో పాటు సమీపంలోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా తాత్కాలికంగా మూసి వేశారు.

Tags:    

Similar News