Donald Trump: 38మంది కన్యలు.. వర్జిన్స్ కావాలంటూ డొనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్.. ముస్లింస్ ఫైర్!
Donald Trump: ఈ ఘటన ట్రంప్ మతపరమైన వ్యాఖ్యలు ఇకపై ఎలాంటి ప్రభావం చూపుతాయో, మత సామరస్యం పట్ల అమెరికా రాజకీయ వ్యవస్థ ఎలా స్పందిస్తుందో ఆసక్తికరంగా మారింది.
Donald Trump: 38మంది కన్యలు.. వర్జిన్స్ కావాలంటూ డొనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్.. ముస్లింస్ ఫైర్!
Donald Trump: అమెరికాలో నేషనల్ ప్రేయర్ డే సందర్భంగా మరోసారి డొనాల్డ్ ట్రంప్ తన విధ్వంసక వ్యాఖ్యలతో చర్చకు కేంద్రబిందువయ్యాడు. మే 1న వైట్ హౌస్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ మతాల నాయకులు పాల్గొన్నారు. ట్రంప్ చుట్టూ ప్రార్థనలకు లేచిన నాయకులు "డివైన్ డ్రీమ్స్" రావాలని కోరుతూ ప్రార్థనలు చేశారు. అదే వేదికపై ట్రంప్ మతపరమైన విమర్శనీయ వ్యాఖ్యలు చేస్తూ ముస్లింలకు థాంక్స్ చెబుతూ, ఒక విచిత్రమైన సంభాషణను గుర్తు చేశాడు. మిచిగన్‌లోని ఇమామ్‌లతో జరిగిన చర్చలో 38 కన్యలను ప్రస్తావించాడు. అయితే ఇస్లాం సంప్రదాయాల్లో పరలోక ఫలితంగా చెప్పబడే "72 కన్యలు" అనే తత్త్వం కొంతమందికి తెలుసు. ట్రంప్ చెప్పిన 38 సంఖ్య ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికీ అర్థం కాలేదు.
ట్రంప్ తన ప్రెసిడెన్సీ తర్వాత మతపరమైన వ్యాఖ్యలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం గమనించదగ్గది. 2024 ఎన్నికల ప్రచారంలో గాయపడిన తర్వాత తాను దేవుని దయ వల్ల బ్రతికానని చెప్పడం, ఇక దేశానికి మతాన్ని తిరిగి తీసుకురావాలని చెప్పడం అతని తాజా మాటల్లో కనిపించింది. ఈ సందర్భంగా అతను "రిలిజియస్ లిబర్టీ కమిషన్" అనే కొత్త కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు.
ఇక ముస్లిం ఓటర్లకు ధన్యవాదాలు చెప్పిన ట్రంప్, మిడిలీస్ట్‌లో హింస ముగిస్తానన్న తన హామీకి మద్దతుగా ఓటేశారని వ్యాఖ్యానించాడు. అయితే మిచిగన్‌లోని ఇమామ్‌లతో తన సంభాషణలో 38 కన్యలను ప్రస్తావించడం, వారి స్పందనను వివరించడం అతని స్థాయికి తగినదేనా అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. ట్రంప్ తనదైన శైలిలో వ్యంగ్యంగా స్పందించినా, ఇస్లాం ధర్మాన్ని అపహాస్యం చేయడమేనన్న విమర్శలు ఊపందుకున్నాయి.
సోషల్ మీడియాలోనూ ఈ అంశం వేడెక్కింది. కొందరు ట్రంప్ పై ఘాటుగా స్పందిస్తుండగా, మరికొందరు అతని సంఖ్యా లెక్కలు పట్ల విమర్శలు గుప్పించారు. “72 కన్యలే అంటారు.. ట్రంప్ 38 అంటున్నాడు. మిగిలినవి అతని స్నేహితులకేనా?” అంటూ సెటైర్లు కూడా వేశారు. ఈ ఘటన ట్రంప్ మతపరమైన వ్యాఖ్యలు ఇకపై ఎలాంటి ప్రభావం చూపుతాయో, మత సామరస్యం పట్ల అమెరికా రాజకీయ వ్యవస్థ ఎలా స్పందిస్తుందో ఆసక్తికరంగా మారింది.