Corona Cases In China: చైనాలో ఆల్‌టైమ్ హైకి రోజువారీ కరోనా కేసులు
Corona Cases In China: రోజు రోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు.. రికార్డు స్థాయిలో ఒక్కరోజే 31వేల కేసులు నమోదు
Corona Cases In China: చైనాలో ఆల్‌టైమ్ హైకి రోజువారీ కరోనా కేసులు
Corona Cases In China: చైనాలో కరోనా కేసులు ఆల్‌టైమ్ హైకి చేరుకున్నాయి. మహమ్మారి విజృంభణతో వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. రికార్డు స్థాయిలో 31 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.. 32,695 మందికి వైరస్ నిర్ధారణ అయింది. ఇందులో 3,041 మందికి కరోనా లక్షణాలు ఉండగా.. 29,654 మందికి ఎలాంటి లక్షణాలు లేవని అధికారులు తెలిపారు. దీంతో వైరస్ విజృంభణను నిలువరించడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఎక్కువ కేసులు నమోదవుతున్న పట్టణాల్లో లాక్‌డౌన్లు విధిస్తున్నారు.
తాజాగా రికార్డయిన పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా గ్వాంగ్ జౌ, ఛోంగ్ క్వింగ్ పట్టణాల్లో ఉన్నాయి... ఛెంగ్డూ, జినాన్, లాన్ జౌ, గ్జినా, వుహాన్ పట్టణాల్లో కూడా భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఆయ పట్టణాల్లో ప్రజలు అత్యవసరమైతే తప్ప తమ ఇళ్ల నుంచి బయటకు రాకూడని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.