ప్రధాని సంచలన నిర్ణయం.. అదృష్టం కోసం తన పుట్టిన రోజు మార్పు..

Cambodia: వరుస కష్ట, నష్టాలు వచ్చినప్పుడు దురదృష్టం వెంటాడుతుందని భావిస్తారు.

Update: 2022-05-21 13:30 GMT

ప్రధాని సంచలన నిర్ణయం.. అదృష్టం కోసం తన పుట్టిన రోజు మార్పు..

Cambodia: వరుస కష్ట, నష్టాలు వచ్చినప్పుడు దురదృష్టం వెంటాడుతుందని భావిస్తారు. పరిస్థితులు అనుకూలించేలా కాలం కలిసొచ్చేలా చేసుకునేందుకు కొందరు పేరులో చిన్న చిన్న మార్పులు చేసుకుంటారు. మరికొందరేమో ఉన్న పేరుకు బలం లేదని పేరునే మార్చుకుంటారు. ఇలాంటి సంఘటనలను మనం నిత్యం చూస్తూనే ఉంటాం అదృష్టాన్ని మార్చుకోవడానికి ఓ దేశ ప్రధాని ఏకంగా తన పుట్టిన రోజునే మార్చుకునేందుకు సిద్ధమయ్యాడు. అత్యంత అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తి తీసుకున్న ఈ నిర్ణయంపై ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇంతకు ఆ ప్రధాని ఎవరో కాదు కంబోడియా దేశాధినేత హన్‌సెన్‌.

కంబోడియా ప్రధానమంత్రి హన్‌సెన్ సోదరుడు, 72 ఏళ్ల హన్‌నెంగ్‌ అనారోగ్యానికి గురయ్యాడు. సింగపూర్‌ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని తిరిగి స్వదేశానికి వచ్చిన తరువాత మే 5న గుండెపోటుతో మృతి చెందాడు. ఈ విషయం ప్రధాని హన్‌సెన్‌ను కలవరపరిచింది. తన సోదరుడి హన్‌నెంగ్‌కు రెండు పుట్టిన రోజులు ఉన్నాయని అందులో దోషం ఉందని హన్‌సెన్‌ వాదిస్తున్నారు. హన్‌నెంగ్‌ ఒక పుట్టిన తేదీ రాశిచక్రం ఆవును, మరో పుట్టిన తేదీ పులిని సూచిస్తోంది. వీటి కారణంగానే ఆయన చనిపోయారని ప్రధాని చెబుతున్నారు. సోదరుడిలాగే తనకు కూడా రెండు పుట్టిన రోజులు ఉండడంతో దోషం వస్తుందని భయపడిపోయారు. చైనీస్ రాశిచక్రాలను బలంగా నమ్మే ఆయన వెంటనే ఓ నిర్ణయానికి వచ్చి ఒకే పుట్టిన రోజును పెట్టుకోవాలని భావించారు.

కంబోడియా ప్రధానమంత్రి పుట్టిన 1951 ఏప్రిల్‌ 5 కాగా దాన్ని 1952 ఆగస్టు 5నకు మార్చుకున్నారు. ఇక నుంచి తన అధికారిక పుట్టిన రోజుగా ప్రధాని హన్‌సెన్ ప్రకటించారు. చట్టబద్దంగా తన పుట్టిన తేదీని మార్చుకునే అంశంపై ఆ దేశ న్యాయ శాఖమంత్రి కోయుట్‌ రిత్‌తో చర్చించిట్టు ప్రధాని తెలిపారు. త్వరలో ఆయన కొత్త పుట్టిన తేదీని చట్టబద్ధంగా రిజిస్టర్‌ చేసుకుని ప్రకటించే అవకాశం ఉంది. వాస్తవానికి కంబోడియాలో 1975 నుంచి 1979 వరకు ఖైమర్ రూజ్‌ పాలనా కాలంలో చాలా మంది తమ అధికారిక రికార్డులను కోల్పోయారు. దీంతో 50 ఏళ్లు పైబడిన కంబోడియన్లందరికీ రెండేసి పుట్టిన రోజులు ఉన్నాయి.

Full View


Tags:    

Similar News