Bangladesh Violence: బంగ్లాలో భయానకపరిస్థితులు..మరో 43మంది మృతి.. జైలు నుంచి 800మంది జంప్

Bangladesh Violence:బంగ్లాదేశ్ లో భయానక పరిస్థితులు నెలకున్నాయి. కర్ఫ్యూ విధించినా..సైన్యాన్ని మోహరించినా ఎలాంటి ఫలితం లేదు. శుక్రవారం ఒక్కరోజే 43 మంది మరణించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. నార్సింగిడి జైలు నుంచి 800మంది ఖైదీలు పరార్ అయినట్లు మీడియా పేర్కొంది.

Update: 2024-07-21 02:54 GMT

Bangladesh Violence: బంగ్లాలో భయానకపరిస్థితులు..మరో 43మంది మృతి.. జైలు నుంచి 800మంది జంప్

 Bangladesh Violence:బంగ్లాదేశ్ అట్టుడుకుంది. రిజర్వేషన్ల సంస్కరణల కోసం జరుగుతున్న ఆందోళనలు హింస్మాత్మక ఘటనలుగా మారుతున్నాయి. దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించినా, సైన్యాన్ని మోహరించిన ఎలాంటి ఫలితం కనిపించడం లేదు. ఘర్షణలో పదుల సంఖ్యలో మరణిస్తున్నారు. శుక్రవారం ఒక్కరోజు 43మంది మరణించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఢాకా బోధానాసుపత్రి దగ్గర 23 డెడ్ బాడీలను చూసినట్లు మరో వార్త ఛానెల్ పేర్కొంది. అయితే గురువారం 22 మంది మరణించిన సంగతి తెలిసిందే.

గత మంగళవారం నుంచి మొదలైన ఈ ఆందోళనల్లో హింసల వల్ల 103 మంది మరణించినట్లు సమాచారం. వేలాది మందికి గాయలయ్యాయి. ఘర్షణలు చల్లారకపోవడం వల్ల కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులను జారీ చేశారు. శుక్రవారం నార్సింగిడి జైలు నుంచి 800 ఖైదీలు పారిపోయినట్లు స్థానిక మీడియా చానెల్ ఒకటి పేర్కొంది. ఆందోళనకారులు జైలుపై దాడి చేసి నిప్పు పెట్టడం వల్ల ఇదే అదనుగా భావించిన ఖైదీలు అందులోనుంచి పారిపోయారు.

ఇక దేశంలో ఘర్షన వాతావరణం నెలకొనడంతో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా తన విదేశీ పర్యటనను క్యాన్సిల్ చేసుకున్నారు. స్పెయిల్, బ్రెజిల్ దేశాల్లో పర్యటించాల్సి ఉంది. ఆందోళన చేస్తున్న విద్యార్థులు హసీనా చర్చలకు ఆహ్వానించారు. ఇక బంగ్లాలో చదువుకుంటున్న పలువురు భారతీయ విద్యార్థులు సురక్షితంగా స్వదేశానికి చేరుకుంటున్నారు.ఇప్పటివరకు సమారు వెయ్యి మంది విద్యార్థులు వచ్చినట్లు సమాచారం. వారిలో 778 మంది సరిహద్దుల ద్వారా వచ్చారు. మరో 200 మంది విమానాల్లో దేశానికి చేరుకున్నారు. ఈ విషయాన్ని భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

Tags:    

Similar News