అమెరికాలో ట్రంప్‌పై పెరుగుతున్న వ్యతిరేకత.. రోడ్డెక్కి నిరసన చేస్తోన్న లక్షలమంది జనం

Anti Trump Protests USA: అమెరికాలో ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై తీవ్ర వ్యతిరేకత మొదలైంది.

Update: 2025-06-16 06:35 GMT

అమెరికాలో ట్రంప్‌పై పెరుగుతున్న వ్యతిరేకత.. రోడ్డెక్కి నిరసన చేస్తోన్న లక్షలమంది జనం

Anti Trump Protests USA: అమెరికాలో ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై తీవ్ర వ్యతిరేకత మొదలైంది. ట్రంప్ వలసదారులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడంపై లక్షలమంది జనం రోడ్లపైకి వచ్చి ట్రంప్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. ట్రంప్ దిగిపోవాలి. నో కింగ్ అంటూ నినాదాలు చేస్తున్నారు. అయితే నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్‌ను ప్రయోగిస్తున్నారు.

ఇటీవల లాస్ ఏంజిల్స్ లో అక్రమ వలసదారులు ఈ దేశం నుంచి వెళ్లిపోవాలంటూ ట్రంప్ నిర్ణయాలు తీసుకోవడం, ఆయన తీరుకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు అది దేశమంతా పాకి తీవ్రస్థాయికి చేరింది.

శని,ఆదివారాల్లో.. ‘ట్రంప్ ఈ దేశానికి అవసరం లేదని, ఇక దిగిపోవాలనే’ ఫ్లకార్డులను జనం ప్రదర్శిస్తూ నిరసనలు చేసారు. వలసదారులను ఇక్కడ నుంచి వెళ్లిపోమని చెప్పే హక్కు ప్రెసిడెంట్‌కు లేదని, ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోకూడదని కొంతమంది వాదన. శనివారం , ఆదివారం సెలవులు కావడం, అలాగే ట్రంప్ పుట్టిన రోజు, అమెరికా సైన్యం 250వ వార్షికోత్సవం కావడంతో పెద్ద ఎత్తున జనం రోడ్లపైకి వచ్చి నిరసనల్లో పాల్గొన్నారు. లాస్ యాంజిల్స్ తో పాటు న్యూయార్క్ , డెన్వర్, ఆస్టిన్, చికాగోలు అలాగే పలు డౌన్ టైన్‌లు, చిన్న చిన్న నగరాల్లో ఈ నిరసనలు వెల్లువెత్తాయి. ఒక్క సియాటెల్ లో దాదాపు 70వేల మంది నిరసనల్లో పాల్గొన్నట్టు సమాచారం.

ఇదిలా ఉంటే మరోవైపు సాల్ట్ లేక్ సిటీలో దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో కొంతమంది గాయపడినట్లు తెలుస్తోంది. అలాగే పోలీసులు.. పోర్ట్ లాండ్ వంటి ఏరియాల్లో నిరసనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు.

Tags:    

Similar News