Ancient Humans: కన్నబిడ్డల్నే చంపి తినేవారట.. సంచలన పరిశోధన వివరాలు!

సొరచేపలు, కొన్ని రకాల తేళ్లు, ధ్రువ ఎలుగుబంట్లు ఆహారం దొరకని సమయంలో తమ పిల్లల్నే చంపి తినేస్తాయి. ఆశ్చర్యకరంగా, లక్షల సంవత్సరాల క్రితం మన పూర్వీకులు కూడా ఇలాగే ప్రవర్తించేవారట.

Update: 2025-07-27 14:00 GMT

Ancient Humans: కన్నబిడ్డల్నే చంపి తినేవారట.. సంచలన పరిశోధన వివరాలు!

సొరచేపలు, కొన్ని రకాల తేళ్లు, ధ్రువ ఎలుగుబంట్లు ఆహారం దొరకని సమయంలో తమ పిల్లల్నే చంపి తినేస్తాయి. ఆశ్చర్యకరంగా, లక్షల సంవత్సరాల క్రితం మన పూర్వీకులు కూడా ఇలాగే ప్రవర్తించేవారట. ప్రాచీన మానవులు తమ పిల్లల్నే చంపి ఆహారంగా తీసుకునేవారని స్పెయిన్ పురాతత్వ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలు చెబుతున్నాయి.

8.5 లక్షల ఏళ్ల నాటి ఆధారాలు

స్పెయిన్‌లోని గ్రాన్ డొలినా ప్రాంతంలో తవ్వకాలు చేపట్టిన శాస్త్రవేత్తలకు సుమారు రెండు నుంచి నాలుగు ఏళ్ల మధ్య వయసున్న చిన్నారి మెడ ఎముక లభించింది. దానిపై పరిశీలన జరపగా, పదునైన వస్తువుతో తల నరికిన గుర్తులు స్పష్టంగా కనిపించాయి. ఇంకా తక్కువ వయస్సు పిల్లల ఎముకలపై కూడా ఇలాంటి కోతలు గుర్తించారని కెటలాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ పెలియోఎకాలజీ అండ్ సోషల్ ఎవల్యూషన్ (IPHES) శాస్త్రవేత్తలు తెలిపారు.

హోమో యాంటెసెసర్స్ కాలంలోనే?

ఈ ఘటనలు ప్రధానంగా హోమో యాంటెసెసర్స్ కాలంలో చోటు చేసుకున్నట్లు పరిశోధకులు తేల్చారు. వీళ్లు నియాండర్తల్స్, హోమో సెపియన్స్ (ప్రస్తుత మానవులు) పూర్వీకులుగా పరిగణించబడతారు. పరిశోధన బృందానికి నాయకత్వం వహించిన పాల్మిరా సలడై మాట్లాడుతూ, “పిల్లల్ని కూడా ఇతర జంతువుల మాదిరిగానే చంపేవారని చెప్పడానికి ఇది ప్రత్యక్ష సాక్ష్యం” అని పేర్కొన్నారు.

మానవుల నరమాంస భక్షణకు సాక్ష్యమా?

మానవుడు తొలినాళ్లలో నరమాంస భక్షణ చేసేవాడని గతంలో అనేక ఊహాగానాలు ఉన్నప్పటికీ, స్పష్టమైన ఆధారాలు లేవు. అయితే, ఈ పరిశోధన ధ్రువీకరించబడితే, ప్రాచీన మానవులు తమ సంతానాన్ని ఆహార వనరుగా ఉపయోగించేవారని బలమైన వాదనకు ఇది మద్దతు ఇస్తుంది.

హోమో యాంటెసెసర్స్ లక్షణాలు

చారిత్రక ఆధారాల ప్రకారం హోమో యాంటెసెసర్స్ 1.2 మిలియన్ నుంచి 8 లక్షల సంవత్సరాల క్రితం జీవించేవారు. పొట్టిగా, బలిష్టంగా ఉండే వీరి మెదడు పరిమాణం 1000–1150 క్యూబిక్ సెంటీమీటర్లు కాగా, ఆధునిక మానవ మెదడు పరిమాణం 1350 క్యూబిక్ సెంటీమీటర్లు. వీరి నుంచే నియాండర్తల్స్, క్రో మాగ్నన్ మ్యాన్, హోమో సెపియన్స్ అభివృద్ధి చెందారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

పురాతత్వ పరిశోధనలు కొనసాగుతూనే

మన పూర్వీకులు ఎలా జీవించేవారు? చనిపోయిన వారిని ఎలా వాడుకునేవారు? అనే ప్రశ్నలకు సమాధానాలు కనుగొనే ప్రయత్నంలో పురాతత్వశాస్త్రవేత్తలు ఇంకా పరిశోధనలు కొనసాగిస్తున్నారు.

Tags:    

Similar News