America: మంచు తుపానుకు వణుకుతున్న అమెరికా

America: ఉష్ణగ్రతలు పెరిగితే మంచు కరిగి ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం

Update: 2022-12-28 03:23 GMT

America: మంచు తుపానుకు వణుకుతున్న అమెరికా

America: భీకర మంచు తుపానుతో అగ్రరాజ్యం అమెరికా చిగురుటాకులా వణుకుతోంది. ఈ శతాబ్ధంలోనే ఎన్నడూ లేనంతగా చలి గాలులు, తుపాన్లు, మంచు ధాటికి అమెరికా జనజీవనం అస్తవ్యస్తమైంది. 4వేలకు పైగా దేశీయ, అంతర్జాతీయ విమానాలు రద్దయ్యాయి. దేశవ్యాప్తంగా 60కి పైగా మంది చనిపోయారు. ఒక్క న్యూయార్క్ రాష్ట్రంలోనే కనీసం 30 మంది వరకు మృతి చెందారు. బఫెలో కౌంటీలో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఎటు చూసినా కనీసం 50 ఇంచుల మేర దట్టమైన మంచు పేరుకుపోయి ఉంది. అయితే గడిచిన ఆరు రోజులతోపోలిస్తే నిన్న పరిస్థితి కాస్త మెరుగైందని వాతావరణ శాఖ ప్రకటించింది. అయితే అమెరికా ప్రజలను మరో భయం వెంటాడుతోంది. ఉష్ణోగ్రతలు పెరిగితే ఇప్పటివరకు పేరుకుపోయిన మంచు ఒక్కసారిగా కరిగి ఆకస్మిక వరదలకు దారితీసే ప్రమాదం పొంచి ఉంది. ముఖ్యంగా బఫెలో తదితర ప్రాంతాల్లో ఈ ముప్పు ఎక్కువని వాతావరణ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో మంచు వరద పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

Tags:    

Similar News