US Tariffs: అమెరికాకు సవాల్.. 'బ్రిక్స్' దేశాల సంచలన నిర్ణయం.. ఐదు దేశాలతో కొత్త యుద్ధం స్టార్ట్

US Tariffs: ఒకపక్క ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య యుద్ధం ఆగేటట్లు లేదు. ఇంకో పక్క, ఇప్పుడు ఒక కొత్త రకమైన యుద్ధానికి తెర లేచింది. ఈసారి ఈ పోరాటం అమెరికాకు వ్యతిరేకంగా జరుగుతోంది.

Update: 2025-06-22 02:53 GMT

US Tariffs: అమెరికాకు సవాల్.. 'బ్రిక్స్' దేశాల సంచలన నిర్ణయం.. ఐదు దేశాలతో కొత్త యుద్ధం స్టార్ట్

US Tariffs: ఒకపక్క ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య యుద్ధం ఆగేటట్లు లేదు. ఇంకో పక్క, ఇప్పుడు ఒక కొత్త రకమైన యుద్ధానికి తెర లేచింది. ఈసారి ఈ పోరాటం అమెరికాకు వ్యతిరేకంగా జరుగుతోంది. ఏకంగా ఐదు దేశాలు అమెరికాకు ఎదురు నిలిచాయి. ఈ ఐదు దేశాలు కలిసి ఈ కొత్త పోరాటానికి ఒక పూర్తి ప్లాన్ కూడా వేసుకుని, బహిరంగంగా ప్రకటించేశాయి. అమెరికా విధించిన టారిఫ్‌లకు వ్యతిరేకంగా ఈ ఐదు దేశాల కూటమి ఒక పెద్ద ప్రకటన చేసింది. ఇప్పటివరకు ఎప్పుడూ చూడని ఒక కొత్త యుద్ధానికి వాళ్ళు సిద్ధమవుతున్నారట. రాబోయే రోజుల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించగలిగే ఆ ఐదు దేశాలు ఏవో, అమెరికా టారిఫ్‌లకు వ్యతిరేకంగా నడుం బిగించి, ఈ కొత్త పోరాటాన్ని ఎలా మొదలుపెడుతున్నాయో వివరంగా తెలుసుకుందాం.

అమెరికా టారిఫ్‌లకు వ్యతిరేకంగా కొత్త ప్లాన్

ప్రపంచంలోనే పెద్ద కూటమిగా చెప్పుకునే బ్రిక్స్ (BRICS) దేశాల అగ్ర నాయకుల సమావేశం రియో డి జెనీరో లో జరగడానికి కొన్ని వారాల ముందు, ఈ కూటమిలోని ముఖ్య సభ్య దేశాల రాయబారులు ఒక విషయం చెప్పారు. అదేంటంటే, ట్రంప్ ప్రభుత్వం టారిఫ్‌ల విధానం చాలా కఠినంగా ఉంది కాబట్టి, వాళ్ళు ఇకపై వ్యాపారం కోసం ఎక్కువగా తమ సొంత దేశ కరెన్సీలనే వాడుకోవాలని ఆలోచిస్తున్నారట.

రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ మాట్లాడుతూ, బ్రిక్స్ సభ్య దేశాల మధ్య వాణిజ్యం కోసం తమ సొంత కరెన్సీలను వాడటానికి తమకు పూర్తి మద్దతు ఉందని ధృవీకరించారు. అలాగే, పెద్ద సవాళ్ళకు పరిష్కారాలను కలిసి చర్చించుకోవడానికి బ్రిక్స్ ఒక మంచి వేదిక అని కూడా ఆయన అన్నారు. ఈ సమావేశంలో 'బ్రిక్స్ కరెన్సీ' గురించి పెద్దగా ఎలాంటి పురోగతి ఉండకపోవచ్చు. ఎందుకంటే, ఒక కొత్త కరెన్సీని తీసుకురావాలంటే చాలా పెద్ద స్థాయిలో మార్పులు, సంస్కరణలు చేయాల్సి ఉంటుంది. గత కొన్ని నెలలుగా, అప్పటి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, బ్రిక్స్ సభ్య దేశాలను అమెరికా డాలర్‌కు బదులుగా బ్రిక్స్ కరెన్సీని మొదలుపెట్టకుండా హెచ్చరించారు కూడా.

అలిపోవ్ శుక్రవారం సాయంత్రం రియోలో జరిగిన ఒక సమావేశంలో మాట్లాడుతూ.. "బ్రిక్స్ అనేది ఏ గ్రూపుకూ వ్యతిరేకం కాదు. పరస్పర గౌరవం, ఒకరి వ్యవహారాల్లో మరొకరు తలదూర్చకపోవడం (నాన్-ఇంటర్ఫిరెన్స్) కోరుకునే దేశాలకు ఇది ఒక ముఖ్యమైన కేంద్రం" అని అన్నారు.

ఆ ఐదు దేశాలు ఏవి?

ఈ సమావేశాన్ని భారతదేశంలోని బ్రెజిల్ రాయబార కార్యాలయం, ప్రపంచ వ్యవహారాలపై దృష్టి సారించే ప్రముఖ పరిశోధనా సంస్థ సెంటర్ ఫర్ గ్లోబల్ ఇండియా ఇన్సైట్స్ (CGII) కలిసి ఏర్పాటు చేశాయి. ఈ బ్రిక్స్ దేశాల సదస్సు జులై 6, 7 తేదీల్లో రియో డి జెనీరోలో జరుగుతుంది. ఈ కూటమికి అధ్యక్షత వహిస్తూ బ్రెజిల్ ఈ సదస్సును నిర్వహిస్తోంది. మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా, ఇంకా ఈ కూటమిలోని ఇతర సభ్య దేశాల నాయకులు ఈ సదస్సులో పాల్గొనే అవకాశం ఉంది.

Tags:    

Similar News