రైల్వే జోన్ కోసం ఎంపీ రామ్మోహన్ నాయుడి అకస్మిక దీక్ష ..

Update: 2018-04-17 05:42 GMT

రాష్ట్ర ప్రయోజనాల కోసం శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడు 12 గంటల పాటు దీక్ష చేపట్టారు. రాష్ట్ర విభజన చట్టంలోని హామీలు సాధించుకోవడం ఆంధ్రుల హక్కు అని, ప్రత్యేక రైల్వే జోన్‌ ఇవ్వాల్సిందేనని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రత్యేక రైల్వేజోన్‌ సాధన దీక్ష పేరుతో చేపట్టిన నిరసన ఉద్యమాన్ని సోమవారం రాత్రి ఏడింటికి ఆమదాలవలస పట్టణంలోని శ్రీకాకుళం రోడ్‌ రైల్వేస్టేషన్‌లో ఆయన ప్రారంభించారు. మంగళవారం ఉదయం ఏడింటికి దీక్ష ముగించారు. రామ్మోహన్‌నాయుడు రైల్వేస్టేషన్‌కు చేరుకోగానే స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ విప్‌ కూన రవికుమార్‌ ఆయనకు స్వాగతం పలికారు. దీక్షకు దిగిన ఎంపీ.. మీడియాతో మాట్లాడుతూ టీడీపీ కేసులకు భయపడదని.. హక్కుల సాధన కోసం పోరాటం ఆగదని స్పష్టం చేశారు. వైసీపీ రాజ్యసభ సభ్యులు ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు. వైసీపీ డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. తన దీక్షకు మద్దతు తెలిపినవారికి రామ్మోహన్‌నాయుడు ధన్యవాదాలు తెలిపారు.

Similar News