జగన్‌తో టీడీపీ నేత కుమారుడి భేటీ...

Update: 2018-01-24 07:57 GMT

జడ్పీ ఫ్లోర్‌ లీడర్‌ వేనాటి రామచంద్రారెడ్డి కుమారుడు సూళ్లూరుపేట మున్సిపల్‌ కౌన్సిలర్‌ వేనాటి సుమంత్‌రెడ్డి మంగళవారం వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డిని కలవడం స్థానికంగా చర్చనీయంశమైంది.
సూళ్లూరుపేటలో వేనాటి కుటుంబ రాజకీయం హాట్‌టాఫిక్‌గా మారిపోయింది. చలికాలంలోనే ఈ ప్రాంతంలో రాజకీయం వేడెక్కింది. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా సూళ్లూరుపేట నియోజకవర్గానికి విచ్చేసిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని విశ్రాంత సమయంలో జడ్పీ ఫ్లోర్‌లీడర్ వేనాటి రామచంద్రారెడ్డి తనయుడు వేనాటి సుమంత్‌రెడ్డి కలవడంతో తెలుగుదేశం పార్టీలో కలకలం రేగింది. 

పెళ్లకూరు మండలం యాత్రలో ఉన్న జగన్‌ను మధ్నాహ్నం విశ్రాంత సమయంలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, నెల్లూరు నగర్ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్‌లతో కలసి సుమంత్ వైకాపా అధినేత జగన్‌ను కలశారు. జగన్ కూడా సుమంత్‌ను ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలు అగిడి తెలసుకున్నారు. అభినందనలు తెలిపి సుమంత్ అక్కడ నుంచి వెళ్లిపోయారు. అక్కడే ఉన్న మీడియా సుమంత్‌ను టీడీపీ నుంచి వైకాపాలోకి వెళ్తున్నారా అంటూ ప్రశ్నించడంతో వెంటనే అటువంటిదేమి లేదని, పాదయాత్రలో ఉన్న జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశానని చెప్పుకొచ్చారు. తమ తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తానని ప్రతిపక్ష నేతతో తనకు వ్యక్తిగత పరిచయాలు ఉన్నాయని అందులో భాగంగానే కొంతమంది ఆ పార్టీలో ఉన్న మిత్రులతోపాటు కలిశానని చెప్పారు. సుమంత్ ఏమి చెప్పిన రెండు రోజుల నుంచి వేనాటి తనయుడు వైకాపాలోకి వెళ్తున్నారన్న పుకార్లు వినిపిస్తున్నాయి.

Similar News