Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కల్యాణ్ మరోసారి తన రాజకీయ వ్యూహం వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యాన్ని స్పష్టం చేశారు.

Update: 2025-12-20 08:44 GMT

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కల్యాణ్ మరోసారి తన రాజకీయ వ్యూహం వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యాన్ని స్పష్టం చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసం తాను తీసుకున్న నిర్ణయాలను విమర్శించిన వారికి ఆయన సూటిగా సమాధానమిచ్చారు. "నేను తగ్గి రాష్ట్రాన్ని పెంచాను.. మిమ్మల్ని గెలిపించాను" అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.

పదేళ్ల పాటు పార్టీని నడిపి కూడా సీట్ల సర్దుబాటు విషయంలో వెనక్కి తగ్గడంపై అప్పట్లో వచ్చిన విమర్శలను పవన్ గుర్తు చేసుకున్నారు. "పొత్తులో భాగంగా తక్కువ సీట్లు తీసుకున్నందుకు నన్ను చాలా మంది విమర్శించారు. సీట్లు అమ్ముకున్నానని నీచమైన ఆరోపణలు చేశారు. కానీ ఆ విమర్శలన్నింటినీ రాష్ట్రాభివృద్ధి కోసం మౌనంగా భరించాను" అని పవన్ పేర్కొన్నారు.

వ్యక్తిగత ప్రయోజనాల కంటే ప్రజా ప్రయోజనాలే ముఖ్యమని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. కేవలం ఎమ్మెల్యే సీట్ల సంఖ్యను పెంచుకోవడం కంటే, రాష్ట్రంలో అరాచక పాలనను అంతం చేయడమే తన లక్ష్యమని ఆయన వివరించారు. "నేను వెనక్కి తగ్గడం వల్ల రాష్ట్రం ముందుకెళ్లింది. స్థిరమైన ప్రభుత్వం ఏర్పడింది. నా త్యాగం వల్ల ఈ రోజు ప్రజలు, రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయి" అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

తాను తగ్గడం వల్ల కేవలం రాష్ట్రమే కాదు, జనసైనికులు మరియు రాష్ట్ర ప్రజల గౌరవం కూడా పెరిగిందని ఆయన అన్నారు. అధికార దాహం కంటే జవాబుదారీతనం ముఖ్యమని, అదే తమ కూటమి ప్రభుత్వ డీఎన్‌ఏ అని పవన్ స్పష్టం చేశారు.

Tags:    

Similar News