Pawan Kalyan: వైసీపీకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ స్ట్రాంగ్ వార్నింగ్.. గీత దాడి మాట్లాడితే.. తాట తీస్తాం
Pawan Kalyan: వైసీపీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
Pawan Kalyan: వైసీపీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. తూర్పుగోదావరి జిల్లా పెరవలిలో అమరజీవి జలధార ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న పవన్.. మాజీ సీఎం జగన్, వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు. అధికారంలోకి వస్తే ఒక్కొక్కరినీ చంపేస్తామని వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని, వైసీపీ తాటాకు చప్పుళ్లకు భయపడేవారెవరూ లేరని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడే రాష్ట్రానికి జగన్ ఏం చేయలేదని, మళ్లీ అధికారంలోకి వచ్చి ఏం చేస్తారని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నప్పుడే వైసీపీకి భయపడలేదన్న పవన్.. గీత దాటి మాట్లాడితే తాట తీస్తామని వార్నింగ్ ఇచ్చారు.