రమణదీక్షితులుకు కేంద్రం షాక్‌

Update: 2018-07-13 04:50 GMT

తిరుమల మాజీ ప్రధానార్చకుడు రమణదీక్షితులుకు కేంద్రం షాకిచ్చింది. టీటీడీపై రమణదీక్షితులు ఫిర్యాదును కేంద్ర న్యాయ శాఖ తోసిపుచ్చింది. తిరుమల వివాదం తమ పరిధిలోకి రాదని, ఏదైనా సమస్య ఉంటే రాష్ట్ర ప్రభుత్వంతోనే పరిష్కరించుకోవాలని సూచించింది. తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగమశాస్త్రాలకు విరుద్ధంగా కార్యక్రమాలు చేపడుతున్నారని, భక్తుల మనోభావాలు దెబ్బ తీసేలా పాలక మండలి నిర్ణయాలు తీసుకుంటోందని రమణదీక్షితులు కేంద్ర న్యాయ శాఖను ఆశ్రయించారు. అర్చక విధుల నుంచి తనను అకారణంగా తొలగించారంటూ మే 23న కేంద్ర న్యాయ శాఖకు ఫిర్యాదు చేశారు. తిరుమల వివాదంపై విచారణ జరిపించాలని కోరారు. అయితే, రమణ దీక్షితులు ఫిర్యాదును పరిశీలించిన కేంద్ర న్యాయ శాఖ తిరుమల వివాదం తమ పరధిలోకి రాదని, రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించాలని సూచిస్తూ రమణ దీక్షితులుకు లేఖ పంపింది.

Similar News