2018 సంక్రాంతి క్రేజీ కథానాయికలు కీర్తి సురేష్, సమంతకి సమ్‌థింగ్ స్పెషల్ కానుంది. కాస్త వివరాల్లోకి వెళితే.. 2018 సంక్రాంతికి కీర్తి సురేష్ నటించిన రెండు భారీ బడ్జెట్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. వాటిలో ఒకటి తెలుగు చిత్రమైతే.. మరొకటి తమిళ చిత్రం. కీర్తి నటిస్తున్న ఆ తెలుగు చిత్రం పవన్ కల్యాణ్ నటిస్తున్న 25వ చిత్రమైతే, తమిళ చిత్రమేమో సూర్య నటిస్తున్న 'తానే సేరంద కూట్టమ్'. ఈ రెండు కూడా కీర్తి కెరీర్‌కి కీలకమైన సినిమాలే.
ఇక సమంతది కూడా కీర్తి లాంటి పరిస్థితే. విశాల్‌తో కలిసి సమంత నటిస్తున్న తొలి తమిళ చిత్రం 'ఇరుంబు తిరై' సంక్రాంతి కానుకగా జనవరి 12న రానుండగా.. రామ్‌చరణ్‌తో మొదటిసారిగా నటిస్తున్న 'రంగస్థలం' కూడా సంక్రాంతికే విడుదయ్యే అవకాశముందని వార్తలు వినిపిస్తున్నాయి. 'రంగస్థలం' డేట్ కన్ఫర్మ్ అయితే గనుక సమంత నుంచి రెండు సినిమాలు సంక్రాంతికి ఉన్నట్టే.
మొత్తానికి కీర్తి సురేష్, సమంతకి ఒకేలాంటి పరిస్థితి 2018 సంక్రాంతికి ఉందన్నమాట. అన్నట్టు.. ఈ ఇద్దరూ సావిత్రి బయోపిక్ 'మహానటి'లో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే.