వారికి మంత్రి పదవులు దక్కుతాయా..

Update: 2018-12-12 03:07 GMT

సంచలన విజయంతో రెండో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు కేసీఆర్.. అయితే ఈసారి మంత్రి వర్గంలోకి కొత్త వారిని తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఓడిపోయిన మంత్రుల స్థానంలో కొత్తవారిని భర్తీ చేయాలనీ కేసీఆర్ భావిస్తున్నారట. ఈ క్రమంలో మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ నుంచి ఓటమిపాలైన జూపల్లి కృష్ణారావు స్థానంలో పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావు మంత్రి వర్గంలోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అలాగే మంత్రి చందులాల్ స్థానంలో డి. ఎస్‌. రెడ్యానాయక్‌ పేరును పరిశీలిస్తున్నట్టు సమాచారం.

ఇక ఖమ్మం జిల్లా పాలేరు నుంచి ఓటమిపాలైన తుమ్మల నాగేశ్వరావు స్థానాన్ని పువ్వాడ అజయ్ కుమార్ తో భర్తీ చేస్తారని అనుకుంటున్నారు. తాండూరులో ఓటమిపాలైన పట్నం మహేందర్ రెడ్డి స్థానాన్ని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో  భర్తీ చేస్తారని టాక్ వినబడుతోంది.  ఖైరతాబాద్ నుంచి గెలిచిన దానం నాగేందర్, కుత్భుల్లాపూర్ నుంచి గెలిచిన వివేకానంద గౌడ్, కొడంగల్ నుంచి గెలిచిన నరేందర్ రెడ్డి, నాగార్జున సాగర్ నుంచి గెలిచిన నోముల నరసింహయ్య లు తమకు మంత్రి పదవులు దక్కుతాయని ఆశలు పెట్టుకున్నారు. 

Similar News