స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో నూతన ఒరవడి సృష్టించిన లెనోవో.. అతి తక్కువ ధరలతో సరికొత్త ఫీచర్లను వినియోగదారులకు అందించింది. ఇక తాజాగా మోటో నుంచి జీ6 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ను మోటోరోలా అందుబాటులోకి తెచ్చింది.. గతేడాది విడుదల చేసిన మోటో జీ5ప్లస్‌కు సక్సెసర్‌గా మోటో జీ6 ప్లస్‌ను తీసుకొచ్చింది. ధర రూ.22,499 మాత్రమే ఉంది. అయితే ఈ ఫోన్‌తో లెనోవో ప్రత్యేక డిస్కౌంట్ అందిస్తోంది. పేటీఎం మాల్ ద్వారా కొనుగోలు చేసే వారికి రూ.3 వేల క్యాష్‌బ్యాక్ లభించనుంది. అలాగే, నోకాస్ట్ ఈఎంఐ సౌకర్యం కూడా ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న నోకియా 6.1 ప్లస్, షావోమి రెడ్మి నోట్ 5 ప్రో ఫోన్లకు ఇది పోటీ ఇవ్వనుంది. 5.9 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే, వెనుకవైపు 12 మెగాపిక్సెల్, 5 మెగాపిక్సెల్ సెన్సార్లతో కూడిన డ్యుయల్ కెమెరా సెటప్ ఉంది. 6జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 630 చిప్సెట్,స్టోరేజ్‌ను పెంచుకునేందుకు వీలుగా అడిషనల్ మైక్రోఎస్డీ స్పెషలిటీ, ఫింగర్ ప్రింట్ సెన్సార్, మోటో జీ6 మాదిరిగానే ప్లస్‌లోనూ ముందు వెనుక గొరిల్లా గ్లాస్ రక్షణ ఉంటుంది.