జగన్ పై యువ హీరో సంచలన వాఖ్యలు..

Update: 2018-06-02 05:57 GMT

ప్రజాసంకల్ప యాత్ర పేరుతో జగన్ తన పాదయాత్రను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. కడప జిల్లా ఇడుపులపాయ నుండి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు జరగుతున్న ఈ పాదయాత్రలో జగన్ కు ప్రజల నుండి పెద్దఎత్తున మద్దతు లభిస్తుంది. అయితే సినీ ప్రముఖుల వద్ద నుండి కూడా జగన్ కు మద్దతు లభిస్తుంది. తాజాగా నటులు పోసాని కృష్ణమురళి, పృథ్వి రాజ్ పాదయాత్రలో కలిసి పాల్గొనగా జగన్ సీఎం అయ్యే ఛాన్స్ కనపడుతుందంటూ సూపర్ స్టార్ కృష్ణ అభివర్ణించాడు. అయితే జగన్ పాదయాత్రను కొనియాడడం ఇప్పుడు ఇంకో కుర్ర హీరో వంతయింది. 

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన పాదయాత్ర చరిత్రాత్మకమని, ఆయన ప్రజలతో మమేకమవుతూ ఇప్పటి వరకు 2 వేల కిలోమీటర్లకు పైగా నడిచారంటే ఆశ్చర్యంగా ఉందని ప్రముఖ నటుడు, నిర్మాత మంచు విష్ణు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా స్ప్రింగ్‌ బోర్డు అకాడమీలో నిర్వహించిన తల్లిదండ్రుల సమావేశంలో పాల్గొనేందుకు శుక్రవారం తణుకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజాసమస్యలపై పాదయాత్రలు చేసిన వారికి ఇప్పటి వరకు అపజయం ఎదురైన సందర్భం రాలేదని చెప్పారు. దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి సైతం పాదయాత్ర చేసి ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని గుర్తు చేశారు. జగన్‌మోహన్‌రెడ్డిలో ఉన్న మానవత్వాన్ని తాను దగ్గరగా చూశానని చెప్పారు.
 

Similar News