సుబ్రహ్మణ్యం అనే కన్నడ హీరో తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ 23 ఏళ్ల యువతి పోలీసులను ఆశ్రయించింది. రాజాజినగర్కి చెందిన ఓ యువతి.. సుబ్రహ్మణ్యంతో రెండేళ్లుగా ప్రేమలో ఉంది. వీరిద్దరి ప్రేమను అంగీకరించి పెద్దలు పెళ్లికి కూడా ఒప్పుకొన్నారు. కానీ షూటంగ్తో బిజీగా ఉన్నానని చెప్పి సుబ్రహ్మణ్యం పెళ్లి వాయిదా వేశాడు. నవంబర్ 1న తన సోదరి ఇంట్లో పార్టీ ఉందనిచెప్పి ఆ యువతిని ఇంటికి రమ్మన్నాడు. అక్కడ మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి యువతిపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత యువతి నిలదీయడంతో త్వరలో పెళ్లి చేసుకుందామని నమ్మబలికాడు. కానీ ఇపుడు పెళ్లి చేసుకోకుండా తప్పించుకు తిరుగుతుండటంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సబ్రహ్మణ్య పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతని కోసం గాలింపు చేపడుతున్నారు.