నాకు వారితో ఎఫైర్లు - హీరోయిన్ రాశి ఖన్నా

Update: 2018-06-23 03:48 GMT

టాలీవుడ్‌లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న హీరోయిన్ రాశి ఖన్నా..  ఆమె ఇటీవల  ఓ ఇండియన్ క్రికెటర్‌తో ప్రేమలో పడినట్లు సోషల్ మీడియాలో వార్తలు తెగ హల్‌చల్ చేశాయి. మొదట్లో  ఈ రూమర్లపై పెద్దగా పట్టించుకోని రాశి.. వాటిపై క్లారిటీ ఇచ్చేసింది. 'నేను లవ్‌లో పడ్డాను అన్న ఆ క్రికెట‌ర్ గురించి నాకు అసలు తెలియదు. ఎన్టీఆర్, రవితేజ తప్ప నేను చేసిన అందరూ హీరోలతోనూ ఎఫైర్లు ఉన్నాయంటున్నారు. నాకు హిట్ సినిమా ఇచ్చిన టాలీవుడ్‌లోని ఓ దర్శకుడితో ఏవేవో సంబంధాలు అంటగట్టారు. ఇవన్నీ అవాస్తవాలే!  అసలు ఇలాంటి వార్తలు ఎలా రాస్తారో కూడా నాకు తెలియదు. అయినా ఒక అమ్మాయి అంత మందితో ఎలా లవ్ లో పడుతుంది' అని అనుకుంటున్నారని క్లాస్ పీకింది. ఈ క్రమంలో  తనకు తన తోటి నటినటులతో స్నేహపూర్వకంగా ఉండే ఎఫైర్లు మాత్రమే ఉంటాయని స్పష్టం చేశారు.  ఆమె క్లారిటీతో  ఈ వార్తలకు ఫులుస్టాప్ పడింది. 

Similar News