ఐదుగురిని రాష్ట్ర కమిటీ నుంచి తప్పించిన టీఆర్‌ఎస్

Update: 2018-12-15 16:23 GMT

తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ కార్యవర్గ సమావేశం మాజీ మంత్రి కేటీఆర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది ఆ పార్టీ. జనవరి నెలలో గ్రామ పంచాయితీ ఎన్నికలు ఉన్న సందర్బంగా గ్రామ స్థాయినుంచి టీఆరెస్ బలోపేతంపై దృష్టి సారించింది. అన్ని జిల్లాల్లో మెజారిటీ పంచాయితీలను గెలుచుకోవాలని పార్టీ క్యాడర్ కు సూచించింది. అలాగే పార్టీ మెంబర్‌షిప్‌, ఇన్సూరెన్స్‌ కార్యక్రమాలు పూర్తి చేయాలన్నారు. త్వరలో రానున్న పార్లమెంట్‌ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలన్నారు. ప్రతి పార్లమెంట్‌ స్థానానికి ఒక ఇంఛార్జ్‌, జనరల్‌ సెక్రటరీ పని చేయాలని సూచించారు. తాజాగా ఎన్నికైన శాసనసభ్యుల్లో సుంకే రవి శంకర్‌, ముఠా గోపాల్‌, మైనంపల్లి హనుమంతరావు, బండ్ల కృష్ణ మోహన్‌ రెడ్డి, పట్నం నరేందర్‌ రెడ్డిలను రాష్ట్ర కమిటీ నుంచి తప్పించింది.

Similar News