వైయస్ ఆఖరి సంతకం అదే : గంగుల హేమలత

Update: 2017-12-12 06:07 GMT

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి తన అన్న అయిన గంగుల సూర్యనారాయణరెడ్డి అలియాస్ మద్దెలచెర్వు సూరిని జైలు నుంచి బయటకు తెచ్చేందుకు చాల కృషి చేసారని సూరి చెల్లెలు హేమలతారెడ్డి నిన్న ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు.. ఆయన చనిపోయే నెలొరోజుల ముందు సూరిని బయటకు తీసుకురావడానికి జరగాల్సిన అధికారిక కార్యక్రమాలపై సమీక్షించారని చెప్పిన ఆమె.. సూరి కేసును క్లోజ్ చేయించడానికి ప్రభుత్వం తరుపున ఫైల్ పై సంతకం కూడా చేసారు, బహుశా వైయస్ ఆఖరి సంతకం అదేనని అనుకుంటున్నాని చెప్పారు.. 

ఇక తన అన్నతో ఉన్నఅనుబంధం ఎప్పటికి మరచిపోనిదని చెప్పిన ఆమె చిన్నప్పటి ఒక సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు.. తనకు ఎనిమిదేళ్ల వయసులో ఒక కార్యం నిమిత్తం ఊర్లో పిల్లలందరం ఇంటింటికి తిరిగి చందా అడుగుతున్న తరుణంలో అన్న సూరి వద్దకు వెళ్లి అడగగా అప్పట్లో అందరికన్నా 500 వందల రూపాయలు ఇచ్చి నాపై తనకున్న అపారమైన గౌరవాన్ని చాటుకున్నారు అంటూ చెమర్చిన కళ్ళతో చెప్పారు.. సూరి ఎప్పుడైనా పదిమందికి సహాయం చేసేవారే కానీ హత్యలు చేద్దామనే ఉద్దేశం ఎప్పుడు లేదన్నారు.. తమ కుటుంబానికి జరిగిన అన్యాయరీత్యా అన్న ఆలా మారవలసి వచ్చిందని అది కూడా ఆ ఫ్యామిలీపైనే ప్రతీకారంతో ఉన్నారే తప్ప మరెవరితోను కాదని పరోక్షంగా పరిటాల కుటుంబాన్ని ఉద్దేశించి హేమలత చెప్పారు..

Similar News