ఏపీ మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే పీతల సుజాతను అసభ్యకరంగా దూషిస్తూ ఓ వ్యక్తి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. దీనిపై భట్టువారిగూడెంకు చెందిన తెదేపా కార్యకర్త వీరేంద్ర చింతలపూడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడిపై కఠినచర్యలు తీసుకోవాలని కోరాడు. ఫిర్యాదు ఆధారంగా నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సీహెచ్. వెంకటేశ్వర్లు తెలిపారు.