నైటీ ధరిస్తే రూ.2 వేలు జరిమానా

Update: 2018-11-10 18:31 GMT

సర్వ సాధారణంగా అయితే  ట్రాఫిక్ పోలీసుల వద్ద, ప్రభుత్వ పరమైన చర్యలను ఉల్లగిస్తే జరిమానా విధింపు ఉంటుంది. అయితే ఒక ఊరిలో అయితే ఆడవాళ్లు నైటీలు ధరిస్తే మాత్రం అక్కడ జరిమాన చెల్లించల్సిందే. ఇందంత ఏ ప్రపంచంలోనో, దేశంలోనో కాదు మన పక్కనున్న ఆంధ్రప్రదేశ్ రాష్టంలోని పశ్చిమగోదావరి జిల్లా తోకలపల్లి గ్రామంలో ఈ వింత ఆచారం ఉంది. ఈ ఉరిలో తొమ్మండుగురు మంది పెద్ద మనుషులు కలిసి కమిటీ ఏర్పాటు చేశారు. ఈ తీర్మాణంలో పొద్దుగల 7 గంటల నుంచి రాత్రి 7 గంటల మధ్య ప్రాంతానా ఆడవాళ్లు నైటీ వేసుకోరాదని ఖరాఖండిగా అందరి సమక్షంలో  తీర్మానించింది. ఒకవేళ ఈ నిబంధనలను ఉల్లగిస్తే రూ. 2వేల రూపాల జరిమాన విధించారు. ఉదయం మహిళలు నైటీ ధరించిన సమాచారం ఇచ్చిన వారికి రూ. 1000 రూపాలు బహుమానం కూడా ప్రకటించారు. అయితే ఈ ముచ్చట కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఆ ఊరి రెవెన్యూ అధికారి విచారణ చేపట్టారు. ఈ విషయంపై గ్రామ సర్పంజ్ ను నీలదీయగా మహిళలు సంప్రదాయంగా, గౌరవంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని గ్రామ సర్పంచ్ మహాలక్షీ వివరించారు. 
 

Similar News