సుందర్‌రావు కూతుర్ని: అనసూయ

Update: 2018-07-28 05:00 GMT

పోచంపల్లిలో సినీనటి, ప్రముఖ యాంకర్‌ అనసూయ సందడి చేశారు. చేనేత దినోత్సవ సంబురాల్లో భాగంగా యార్రమాద వెంకన్న నేత ఆధ్వర్యంలో భూదాన్ పోచంపల్లిలో  చేనేత కళాకారులకు సన్మానం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగు యాంకర్, నటి అనసూయ పాల్గొన్నారు. ఈసందర్భంగా అనసూయ భూదాన్ పోచంపల్లిని సందర్శించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు నేత కార్మికుల పనితనాన్ని అనసూయ గమనించారు. ఈక్రమంలో ప్రముఖ చేనేత కళాకారుడు చిలువేరు రామలింగం ఒక్క కుట్టు లేకుండా నేసిన మూడు కొంగుల చీరను చూసిన అనసూయ సంబ్రమాశ్చర్యానికి లోనయ్యారు. ఆయన కళాత్మక సృష్టి అద్భుతమని ఆమె పొగిడారు. ఈసందర్భంగా కీర్తిశేషులు రామలింగం సతీమణి అనసూయను నటి అనసూయ సన్మానించారు.
తాను కూడా పోచంపల్లి ఆడపడుచునని, తనకు పోచంపల్లితో ఎంతో అనుబంధం ఉందని అనసూయ గుర్తుచేశారు. చేనేత కార్మికులతో ముచ్చటిస్తూ తాను పోచంపల్లి సుందర్‌రావు కూతురునని పరిచయం చేసుకున్నారు. 8వ తరగతిలో ఉండగా పోచంపల్లికి వచ్చానని ఇల్లు, చెరువు ఒక్కటే గుర్తుకున్నాన్నారు. 20 ఏళ్ల తర్వాత పోచంపల్లికి వచ్చానని, సొంతూరి ప్రజలు చూపిస్తున్న ఆదరణ మరువలేనిదని ఆనందభాష్పాలు రాల్చారు. ఇకపై వీలైనపుడల్లా పోచంపల్లికి వస్తానని హామీ ఇచ్చారు.

Similar News