Petrol Price Today 24.10.2019: స్వల్పంగా తగ్గిన పెట్రోల్ ధరలు!

నిన్న స్థిరంగా ధరలు పెట్రోల్ ఈరోజు కొంత తగ్గాయి. 24.10.2019 గురువారం హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర లీటరుకు 5 పైసలు తగ్గింది. దీంతో పెట్రోల్ ధర 77.81 రూపాయలకు చేరింది.

Update: 2019-10-24 02:35 GMT

నిన్న స్థిరంగా ధరలు పెట్రోల్ ఈరోజు కొంత తగ్గాయి. 24.10.2019 గురువారం హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర లీటరుకు 5 పైసలు తగ్గింది. దీంతో  పెట్రోల్ ధర 77.81 రూపాయలకు చేరింది.  ఇక డీజిల్ ధర కూడా 6 పైసల మేర తగ్గుదల నమోదు చేసింది దీంతో 72.03 రూపాయలైంది. అటు అమరావతిలోనూ ఇదే పరిస్థితి వుంది. ఇక్కడా పెట్రోల్ ధర లీటరుకు 5 పైసలు పెరిగింది.దీంతో  77.42 రూపాయలు గా నిలిచింది. ఇక డీజిల్ ధర కూడా 5 పైసలు తగ్గడంతో  71.33 రూపాయల వద్దకు చేరింది.  ఇక విజయవాడలో కూడా పెట్రోల్ ధర , డీజిల్ ధర ల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది.  దీంతో పెట్రోల్ ధర లీటరుకు 5 పైసలు తగ్గి 77.05 రూపాయలుగానూ, డీజిల్ ధర లీటరుకు 5 పైసలు తగ్గి  71.33 రూపాయలుగానూ నిలిచాయి.

దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇదే పరిస్థితి ఉంది. అక్కడా పెట్రోల్ ధర లీటరుకు 5 పైసలు తగ్గింది. దాంతో 73.17 రూపాయలుగా నిలిచింది. డీజిల్ ధర లీటరుకు 5 పైసలు తగ్గడంతో  66.06 రూపాయలుగా నమోదైంది. వాణిజ్య రాజధాని ముంబయిలో కూడా  పెట్రోల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. ఇక్కడ పెట్రోల్ ధర లీటరుకు 5 పైసలు, డీజిలు లీటరుకు 5 పైసలు తగ్గడంతో,  పెట్రోల్ లీటరుకు  78.78 రూపాయలుగానూ, డీజిల్ ధర లీటరుకు 69.24 రూపాయలుగానూ ఉన్నాయి.

పెట్రోల్ డీజిల్ ధరలు ప్రతిరోజూ ఉదయం ఆరు గంటలకు మారుతుంటాయి. ఈ విధానం రెండేళ్లుగా అమలులోకి వచ్చింది. ప్రతి ఉదయం ముఖ్య నగరాల్లో ప్రకటించిన పెట్రోల్ ధరలు ఇక్కడ ఇవ్వడం జరుగుతోంది.


Tags:    

Similar News